ఏడు నెలల ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. గడువు లోగా బడ్జెట్ ఆమోదం పొందక పోవడమే ప్రభుత్వం కూలిపోడానికి కారణమైంది. వచ్చే ఏడాది మార్చి 23 న ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గత రెండేళ్లలో నాలుగోసారి ఇజ్రాయెల్ ఎన్నికలకు వెళుతోంది.
2019 ఏప్రిల్‌లో బెన్నీ గాంట్జ్ సారధ్యం లోని బ్లూ అండ్ వైట్ పార్టీతో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వం లోని లికుడ్ పార్టీ పొత్తు కుదుర్చుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి. ప్రధాని పదవిని ఇరు వర్గాలు పంచుకోవాలని నిర్ణయమైంది.
ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది నవంబర్ లోనే గాంట్జ్‌కు అధికారాన్ని బదలాయించాల్సి ఉండగా, ఈలోగా రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. బడ్జెట్‌పై ఏకాభిప్రాయం కుదరలేదు. మంగళవారం అర్ధరాత్రి గడువు లోగా బడ్జెట్ ఆమోదం పొందకపోవడంతో పార్లమెంట్ రద్దుకు దారి తీసింది.
కరోనా సంక్షోభం సమయంలో అనవసరంగా ఎన్నికలు వచ్చేలా బ్లూ అండ్ వైట్ వ్యవహరిస్తోందని ప్రధాని నెతన్యాహు ఆరోపించగా, ప్రధాని తన విచారణలో నిమగ్నమై ప్రజా ప్రయోజనాలను పట్టించుకోలేదని గాంట్జ్ ఆరోపించారు. వ్యాక్సిన్ ప్రచారంలో ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
More Stories
ఇజ్రాయిల్ నగరాలపై రాకెట్ల వర్షం
సరిహద్దుల్లోకి డ్రాగన్ డ్రోన్లు.. నిఘా కోసమేనా?
వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం