ఎప్పుడంటే అప్పుడే రైతులతో చర్చలకు సిద్ధం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్ర నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు చర్చలు జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు.  ప్రస్తుతం కొనసాగుతున్న సందిగ్ధానికి వీలైనంత తొందరగా పరిష్కారం కావాలని, దానికోసం తాను ఎన్ని ప్రయత్నాలైనా చేస్తానని తోమర్ స్పష్టం చేశారు.

‘‘మా ప్రతిపాదనలపై రైతులు చర్చిస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్లు ఏం కావాలనుకుంటున్నారు, ఏం వద్దనుకుంటున్నారో చెప్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వారు కొరుకున్నవి చట్టంలో చేర్చి, వద్దన్నవి తీసేస్తాం” అంటూ భరోసా ఇచ్చారు. 

ఈ విషయమై వారితో చర్చిందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూ తేదీ, సమయం రైతులే నిర్ణయించుకోనివ్వండని తెలిపారు. వారు కోరినప్పుడే చర్చలు చేస్తామని పేర్కొంటూ ప్రస్తుతం ఉన్న సందిగ్ధానికి పరిష్కారం దొరుకుతుందని తోమర్ ఆశాభావం వ్యక్తం చేశారు. .

అంతే కాకుండా బ్యాంకులకు తోమర్ కృతజ్ణతలు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కింద 8 నెలల కాలంలో లక్షమంది రైతుల ఖాతాల్లో లక్ష కోట్ల రూపాయలు పంపిణీ చేశాయని బ్యాంకులను కొనియాడారు. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా బ్యాంకింగ్ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు చేస్తామని ఆయ తెలిపారు. 

రైతులకు ఉపయోగపడే వివిధ రకాల పథకాల మధ్యనున్న అంతరాన్ని తగ్గించి రైతులకు లాభం తీసుకువచ్చే విధంగా సంస్కరణలు చేయబోతున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో వ్యవసాయ రంగం ఒక్కటే నిలబడగలిగిందని తోమర్ గుర్తు చేశారు.