టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో సీబీఐ సోదాలు ముగిశాయి. గుంటూరు, హైదరాబాద్ నివాసాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. బెంగళూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఏకంగా 7 గంటల పాటు విచారణ కొనసాగించారు.
ట్రాన్స్‌రాయ్ సంస్థ బెంగళూరులోని కెనరా బ్యాంక్‌కు రుణాలు చెల్లించలేదు. ఇందులో భాగంగానే కెనరా బ్యాంకు ఉద్యోగులతో కలిసే సీబీఐ అధికారులు రాయపాటి నివాసాలకు చేరుకున్నారు.
ఈ రెండు సంస్థల మధ్య జరిగిన లావాదేవీలపై, ట్రాన్స్‌ట్రాయ్ సంస్థతో ఉన్న సంబంధాలపై రాయపాటిని సీబీఐ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కెనరా బ్యాంకు నోటీసు కాపీలను సీబీఐ తీసుకెళ్లింది.
దాదాపు ఏడు గంటల పాటు సాగిన ఈ విచారణకు రాయపాటి కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించారు. ఈ విచారణలో రాయపాటి స్టేట్‌మెంట్‌ను కూడా సీబీఐ రికార్డ్ చేసినట్లు సమాచారం. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సీబీఐ సోదాలు… సాయంత్రం 3 గంటల వరకు నిరాటంకంగా ఈ సోదాలు సాగాయి.

More Stories
మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు జరపాలి
సంఘ్ జేష్ఠ కార్యకర్త దోనేపూడి వెంకయ్య మృతి
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ కన్నుమూత