మిత్ర దేశమైన బంగ్లాదేశ్ తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో పర్చువల్ విధానంలో ప్రధాని భేటీ అవుతూ కరోనా ప్రపంచ దేశాలకు సవాళ్లు విసిరిందని పేర్కొన్నారు.
కరోనా కష్టకాలంలో బంగ్లాదేశ్ నుంచి భారత్ కు మంచి సహకారం అందిందని మోదీ కొనియాడారు. హెల్త్ ప్రొఫెషనల్స్, కరోనా టీకా అంశంలో రెండు దేశాలు కలిసి పని చేసినట్లు వెల్లడించారు. మహాత్మా గాంధీ, షేక్ ముజిబుర్ రెహ్మాన్‌లపై డిజిటల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు. ఈ ఎగ్జిబిషన్లు యువతకు ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోవడంపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రశంసలు కురిపించారు. 1971 యుద్దాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 30 లక్షల మంది అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నానన్నారు ప్రధాని హసీనా. భారత సాయుధ దళాల సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు.
మా దేశ విముక్తి కోసం హృదయపూర్వక మద్దతు ఇచ్చిన భారత ప్రభుత్వం, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. . బంగ్లాదేశ్ విజయానికి గుర్తుగా విజయ్ దివస్ జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. ప్రధాని మోదీ తనను బంగ్లాదేశ్ పర్యటనకు ఆహ్వానించడంపైనా ఆయన హసీనాకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా ఆ సమయంలో అమరవీరులకు నివాళులు అర్పించే అవకాశం రావడాన్నిగౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
More Stories
ఆసియా చాంఫియన్స్ హాకీ ట్రోఫీ విజేత భారత్
రష్యాలో పిల్లల కోసం భోజన విరామంలో శృంగారం
న్యూయార్క్‌లోని స్వామినారాయణ దేవాలయం ధ్వంసం