కర్ణాటక శాసన మండలి సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. గోవధ నిషేధ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో డిప్యూటీ చైర్మన్ భోజెగౌడను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుర్చీ నుండి లాక్కెళ్లారు. చైర్‌లో కూర్చోవడానికి ఆయన అనర్హుడు అంటూ కిందకు దించేశారు.
దీంతో మండలిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఐదు రోజుల వాయిదా తర్వాత మండలి మళ్లీ ఇవాళ సమావేశమైంది. బిల్లులు అడ్డుకుంటున్నారని చైర్మన్ కె.ప్రతాపచంద్ర శెట్టిపై పై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది.
చైర్మన్ సీట్లో కూర్చునే అర్హత లేదంటూ శాసనమండలి సభాపతితో కాంగ్రెస్ సభ్యులు అమర్యాదగా ప్రవర్తించారు. చైర్మన్ ను కుర్చీనుంచి బలవంతంగా లాగీ అవతలకు నెట్టేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ మాట్లాడుతూ.. బీజేపీ, జేడీఎస్‌లు కలిసి ఛైర్మన్‌ను ఆ స్థానంలో అక్రమంగా కూర్చోబెట్టాయని ఆరోపించారు. సభ అదుపులో లేనప్పుడు డిప్యూటీ ఛైర్మన్ ఆ స్థానం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్సీ లేహర్ సింగ్ సిరోయా మాట్లాడుతూ.. కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గూండాల్లా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. బలవంతంగా డిప్యూటీ చైర్మన్‌ను కుర్చీలో నుంచి లాక్కెళ్లడం దారుణమన్నారు. మండలి చరిత్రలో ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదని గుర్తు చేశారు. మండలి సభ్యులు ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా? అని ప్రశ్నించారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
జార్ఖండ్‌కు అతిపెద్ద శత్రువులు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ
కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం ప్రచార ఎత్తుగడే!