టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా బైడెన్, హ్యారిస్   

టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా బైడెన్, హ్యారిస్   
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌, కాబోయే ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ సంయుక్తంగా టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎంపికయ్యారు. టైమ్‌ సంస్థ వీరిద్దరి ఫొటోను మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై ముద్రించింది. 
 
‘అమెరికా గతిని మారుస్తున్నారు’ అని క్యాప్షన్‌ పెట్టింది. విభజన శక్తుల కంటే సానుభూతి గొప్పదని చాటినందుకు, విభజన గాయాలను నయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నందుకు, అమెరికా గతిని మార్చుతున్నందుకు వీరిద్దరినీ 2020కి గాను పర్సన్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎంపిక చేసినట్టు వెల్లడించింది.
అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, అమెరి కా అధ్యక్షుడు ట్రంప్‌ ఫైనల్స్‌వరకు పోటీలో ఉన్నా.. బైడెన్‌, హ్యారిస్‌ వారిని దాటుకుని ముందుకెళ్లారు. ‘‘చేంజింగ్‌ అమెరికాస్‌ స్టోరీ’’ అన్న ఉపశీర్షికతో టైమ్‌ మేగజీన్‌ వారి ఘనత ను కీర్తించింది. 1927 నుంచి టైమ్‌ మేగజీన్‌ ఏటా ఆ సంవత్సరంలో ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి/వ్యక్తులకు గుర్తింపునిస్తూ.. తన కవర్‌పేజీపై చోటు కల్పించి గౌరవిస్తుంది.
 
ప్రముఖ వైద్యుడు ఆంథోనీ ఫౌచీని ‘2020 గార్డియన్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ జాబితాలో చేర్చింది. మరోవైపు, జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా ఆందోళన నిర్వహించిన వారికి ఆశ్రయం కల్పించిన భారత సంతతి వ్యక్తి రాహుల్‌ దూబేకు ‘టైమ్‌ హీరోస్‌ ఆఫ్‌ 2020’ జాబితాలో చోటు దక్కింది.