ముఖ్యమంత్రి కేసీఆర్ గారాల పుత్రిక, అధికారపార్టీ ఎమ్యెల్సీ కవిత తాజాగా రెండో చోట్ల ఓటేసిన వివాదంలో చిక్కుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్మండలం పోతంగల్లో ఓటు హక్కు ఉన్నా కూడా ఆమె జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఓటు వేశారు.
అక్కడి ఓటర్ లిస్ట్‌లో పోలింగ్బూత్నెం.183, సీరియల్ నెంబర్361పై ఇప్పటికీ ఆమె పేరుతో ఓటు ఉంది. 2014, 2019 జనరల్ ఎలక్షన్స్‌తో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన భర్త, అనిల్ కుమార్, అత్తామామలతో కలిసి ఆమె ఓటు వేశారు.
కవిత రెండు చోట్ల ఓటు వేయడంపై కాంగ్రెస్ మండిపడింది. ఆధారాలతో సహా మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఫిర్యాదు చేశారు.
ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం బోధన్ నియోజకవర్గంలోని పోతంగల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో కవిత ఓటరుగా ఎన్రోల్ చేసుకున్నారని, ఇప్పటికీ అక్కడే ఆమెకు ఓటు హక్కు ఉందని, అయినా కూడా బంజారాహిల్స్‌లో కవిత ఓటెలా వేశారని ఆమె ప్రశ్నించారు.
ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఓటును దుర్వినియోగం చేశారని ఆమెమండిపడ్డారు. పోలింగ్ సెంటర్లోకి మామూలుగా ఫోన్లను తీసుకెళ్లనివ్వరని, కానీ, కవిత మాత్రం ఓటును బ్యాలెట్ బాక్సులో వేసిన ఫొటోలు బయటపెట్టారని విమర్శించారు. ఇది ఎన్నికల రూల్స్‌ను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగాన్ని చిన్నచూపు చూస్తూ ఓటును దుర్వినియోగం చేసిన కవితకు ఎమ్మెల్సీగా కొనసాగే నైతిక హక్కు లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. కవిత ఓటు వేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ, పోతంగల్లో ఓటు ఉన్నా హైదరాబాద్‌లో రెండో ఓటు ఎలా వేశారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్ గ్రామ పరిధిలో తనకు, తన భర్తకు ఉన్న ఓటు హక్కును ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోకి మార్చాలని ఎమ్మెల్సీ కవిత అక్కడి ఈఆర్‌వోకు దరఖాస్తు చేసుకున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. నవంబరు 28న ఓటు బదిలీ ప్రక్రియ పూర్తయిందని, దీంతో కవిత హైదరాబాద్‌లో ఓటు వేశారని పార్టీ నేతలు తెలిపారు.
More Stories
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు
హైదరాబాద్ నుండి నేరుగా గోవాకు రైలు ప్రారంభం