డిసెంబర్ 4న మోదీ అధ్యక్షతన అఖిలపక్షం

డిసెంబర్ 4న మోదీ అధ్యక్షతన అఖిలపక్షం
దేశంలోని కోవిడ్ పరిస్థితిపై చర్చించడానికి ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. డిసెంబర్ 4న ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. 
 
ఇదే విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇప్పటికే  ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో కోవిడ్ పరిస్థితిపై మోదీ ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. అయితే అఖిల పక్షం భౌతికంగా భేటీ అవుతుందా? లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుందా? అన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు. 
 
వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్రం తీసుకుంటున్న జాగ్రత్తలు, పంపిణీ విధానం లాంటి ముఖ్యమైన అంశాలను ఆయా పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోదీ వివరించనన్నారు.