నివర్ తగ్గక ముందే మరో మూడు తుఫాన్లు   

నివర్ తగ్గక ముందే మరో మూడు తుఫాన్లు   

నివర్‌ తుపాను తీవ్రత పూర్తిగా తగ్గకముందే.. మరో మూడు తుపాన్లు రానున్నాయనే వార్త అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. నివర్‌ తుపాన్‌ తీవ్రత క్రమంగా తగ్గుతున్నప్పటికీ అది ఎక్కువ నష్టాన్ని మిగిల్చింది. ఈ తుపాను వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారి కోస్తాంధ్రపై ఆవరించి ఉంది. 

‘నివర్’ ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోకముందే చెన్నైలోని భారత వాతావరణ విభాగం మరో హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ఆదివారం నాటికి బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. 

డిసెంబర్‌ మాసంలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉందని వివరించింది. డిసెంబర్‌ రెండో తేదీన ఏర్పడే బురేవి తుపాన్‌ తీవ్ర ప్రభావం చూపనుందని, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై ఎక్కవ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

డిసెంబర్‌ అయిదవ తేదీన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం టకేటి తుపానుగా మారే ఛాన్సు ఉందని చెబుతోంది.