
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకీ వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిఘా పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కంటోన్మెంట్ జోన్లలో కఠిన ఆంక్షలు అమలవనున్నాయి. ఈ జోన్లలో అత్యవస కార్యక్రమాలకు మాత్రమే సర్కార్ అనుమతి ఇచ్చింది. కంటోన్మెంట్ లేని జోన్లలో లాక్‌డౌన్ విధించొద్దని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశించింది.
కరోనా పాజిటివ్‌గా తేలిన కేసులకు సంబంధించిన కాంటాక్ట్ లిస్టింగ్ చేయాలని కేంద్రం సూచించింది. ట్రాకింగ్, ఐడెంటిఫికేషన్, క్వారంటైన్ చేయాలని.. 72 గంటల్లో 80 శాతం కాంటాక్ట్‌లను ట్రేస్ చేయాలని తెలిపింది. ఈ కొత్త మార్గదర్శకాలు డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయని కేంద్ర హోం శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
కంటోన్మెంట్ జోన్‌ల నుంచి ఎవరూ బయటకు రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రోటోకాల్ ప్రకారం టెస్టింగ్ నిర్వహించాలని.. స్థానిక జిల్లా, మున్సిపల్ అధికారులు, పోలీసులు ఆంక్షలు కఠినంగా అమలయ్యేలా చూడాలని పేర్కొంది. అత్యవసర వైద్యం, సరుకుల రవాణా కోసం కంటోన్మెంట్ జోన్‌లకు పరిమిత స్థాయిలో అనుమతి కల్పించింది.
More Stories
ఈవిఎం సోర్స్కోడ్పై ఆడిట్ పిల్ కొట్టివేత
కావేరి వివాదంలో జోక్యంకు `సుప్రీం’ నిరాకరణ
మొబైల్స్కు ఎమర్జెన్సీ అలర్ట్.. ఆందోళన చెందకండి