మరో 43 చైనా యాప్ లను నిషేధించిన భారత్ 

చైనాకు భారత్ మళ్లీ ఝలక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన 43 మరో యాప్ అప్లికేషన్లను నిషేధిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చైనాకు చెందిన 150కి పైగా మొబైల్ అప్లికేషన్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన  విషయం తెలిసిందే. 

ఇప్పుడు ఆ జాబితాలో మరో 43 యాప్స్ చేరాయి. కొత్తగా నిషేధించిన యాప్స్‌లో చైనా వ్యాపార దిగ్గజ సంస్థ అలీ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది.  చైనాను తన టెక్నాలజీతో శాసిస్తున్న అలీబాబాకు చెందిన యాప్స్ ఉండడంతో చైనా గగ్గోలు పెడుతున్నది.

దానితో పాటు అలీబాబా వర్క్ బెంచ్, హీరోస్ ఎవాల్వ్‌డ్, డింగ్ టాక్ వంటి ఇతర అప్లికేషన్లున్నాయి. ఈ నిషేధం విధించడానికి గల కారణాలను కేంద్రం వెల్లడించింది. భారత సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగే అవకాశం ఉందని, అలాగే రక్షణ రంగ, కేంద్ర-రాష్ట్ర ప్రజల భద్రత దృష్ట్యా ఈ అప్లికేషన్లను నిషేధించినట్లు తెలిపింది.