టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరేందుకు సిద్దమైన్నట్లు తెలుస్తున్నది. ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి కిషన్‌రెడ్డి, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ లతో సమావేశమయ్యారు. బీజేపీలోకి రావాలని వారు ఆయనను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకుడైన అయన తన మండలి సభ్యత్వం ముగిసిన తర్వాత కేసీఆర్ పట్టించుకొనక పోవడం పట్ల కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పైగా మూడేళ్ళుగా వేతన సవరణలు జరపగా పోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్తంపై ఆగ్రహంగా ఉండడంతో ఆయన టి ఆర్ ఎస్ ను విడిచి పెట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
అధికార పార్టీ కంచుకోటగా భావించే దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి విజయం సాధించడంతో అధికార పార్టీలోని అసంతృత్తి నేతలే కాకుండా, తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి కోల్పోతున్నదని గ్రహించి ఆ పార్టీ నేతలు కూడా ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న అగ్ర నేతలతో చర్చలు జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర‌్‌పర్సన్ విజయశాంతి, సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
దివంగత మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మాజీ మేయర్ కార్తీక రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరారు.
మరోవంక, బిగ్ బాస్ ఫేమ్, టీవీ యాంకర్ కత్తి కార్తీక కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆమె కూడా బీజేపీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. దుబ్బాక ఉపఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి అందరి దృష్టి ఆకర్షించారు.
More Stories
ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్
ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!