టీఆర్‌ఎస్‌తో పోటీ లేదు, మజ్లిస్ తోనే  తలపడతాం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు అసలు తమకు టీఆర్‌ఎస్‌తో పోటీ లేదని, కేవలం మజ్లిస్ తోనే తలపడతామని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలలో ఓల్డ్ సిటీ వర్సెస్ రెస్టాఫ్ సిటీ.. 45 వర్సెస్ 105 సీట్లు పోటీ అని తెలిపారు. హెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి మేయర్ పీఠం కట్టబట్టేందుకే టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. 

‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆదాబ్ అనాలే. ఇకపై బ్రాండ్ హైదరాబాద్ కాదు ఆదాబ్ హైదరాబాద్ చేస్తడు కేసీఆర్. ప్రజల మధ్యకు పోతే కేటీఆర్‌ను కొట్టేటట్టు ఉన్నారు” అంటూ అరవింద్ పేర్కొన్నారు. 
 
బీజేపీకి ఓటేస్తే గుజరాత్‌లాగా అభివృద్ధి చెందుతుందని చెబుతూ  రాష్ట్రపతి పాలనలో ఐటీ హైదరాబాద్ వచ్చిందని గుర్తు చేశారు. అయితే  హైటెక్ సిటీని కంజెస్ట్ చేసి ఆ ప్రాంతాన్ని గబ్బుపట్టించారని ధ్వజమెత్తారు. కొంగర కళాన్ సభలో ఇంటింటికి నల్లా నీరు ఇస్తామన్నారు.. 95శాతం పూర్తి అయ్యింది అన్నారు. ఏమైందని ప్రశ్నించారు 
 
అదే విధంగా.. ‘‘బాయికాడ మీటర్లు పెట్టాలని ఎక్కడా లేదు. డిస్కంలకు కోట్ల రూపాయల బకాయిలు పడ్డారు.. ఆ లెక్క చెప్పండి” అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశంలో అనేక ప్రాంతాలను విద్యుదీకరణ చేసింది మోదీ ప్రభుత్వమే అని చెప్పారు. 
 
రూ 97వేల కోట్ల  అప్పులను డిస్కంలకు కేసీఆర్ మిగిల్చారని చెబుతూ  ఒక మతానికి అమ్మడు పోయిన వ్యక్తి కేటీఆర్కరోనా కు ఒక్క ముస్లిం మహిళకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయించారా? అంటూ ప్రశ్నించారు. జవహర్ నగర్ కంపూ జూబ్లీహిల్స్ వరకు వస్తుందని విమర్శించారు. 
 
ఏడాదిలో లక్ష రెండు పడకల ఇల్లు కట్టిస్తామని చెప్పిన కేటీఆర్ ఐదేళ్లయినా హైదరాబాద్‌లో 10వేల ఇల్లు కూడా కట్టలేదు. కట్టిన ఇల్లు ఎందుకు ఇస్తలేరు?  నిజామాబాద్‌లో 200 ఇల్లు కూడా కట్టలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం ప్రెస్‌మీట్‌లు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా మారాయని దుయ్యబట్టారు. 
 
కేసీఆర్ కుటుంబ సభ్యులు కలియుగ కమెడియన్స్ అంటూ ఎంపీ అరవింద్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇల్లు రావాలన్నా.. రిజర్వేషన్లు కావాలన్నా బీజేపీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు.  ఎంఐఎం.. టీఆర్ఎస్ లు దోచుకుతింటున్నాయి తప్ప చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. మతాలను పక్కన పెట్టి బీజేపీ కి ఓటేయమని కోరారు.
 
‘గులాబీ సంచులొస్తయి.. ప్రాజెక్టుల్లో అవినీతి సొమ్ము అది.. తీసుకోండని చెబుతం.. ఇంక ఎక్కువ ఇవ్వాలని డిమాండ్‌ చేయండని చెబుతాం’’ అన్నారు. ఒక్క పెద్ద పరిశ్రమయినా తెచ్చారా? అని మంత్రి కేటీఆర్‌ను సవాల్‌ చేశారు.  టీఆర్‌ఎస్‌ నేతలు తమ అవినీతి సొమ్మును ఇస్తరు. బాజాప్త తీసుకోండి.. ఓటు కమలం గుర్తుకే వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
“మేం ఎన్ని రాష్ట్రాల్లో ఇల్లు కడుతున్నామో వీడియో విడుదల చేస్తాం. కాంగ్రెస్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. డివిజన్ కు 20 నుంచి 50ఓట్లు మాత్రమే ఆ పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకికు మూడంకెల సంఖ్య ఎక్కడా దాటదు. కాంగ్రెస్ ముక్త్ భారత్ మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు.