ఐదేళ్లుగా ఏం చేశారో సీఎం కేసీఆర్‌ చెప్పాలి

‘ఐదేళ్లుగా ఏం చేశారో సీఎం కేసీఆర్‌ చెప్పాలి. దీనిపైనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగాలి. ఈ ఐదేళ్ల పాలనపైనే తీర్పు ఇవ్వాలి’ అని నగర ప్రజలకు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి  పిలుపునిచ్చారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు అమలులో పూర్తిగా విఫమైందని ఆయన ధ్వజమెత్తారు. 

ఒక్కో డివిజన్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఒక్కనాడైనా ఆయా డివిజన్ల డివిజన్‌ ముఖం చూశారా? అభివృద్ధిపై సమీక్ష చేశారా? అని నిలదీశారు.   సీఎం కేసీఆర్‌, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధి తక్కువ అని, ఆర్భాటం మాత్రం ఎక్కువ అని ఎద్దేవా చేశారు.

ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్‌ చేశారు. మాటల గారడీతో పరిపాలన చేస్తున్నారని సెహెబుతూ  కేంద్ర సాయంపై అబద్ధపు ప్రచారాలు ఇంకెన్నాళ్లు అని నిలదీశారు. ఇటీవలి వరదలకు హైదరాబాదులో 5 లక్షల ఇళ్లల్లో బాధితులు సర్వస్వం కోల్పోయారని పేర్కొంటూ  ఇది విశ్వనగరమా? విషాదనగరమా? అని ప్రశ్నించారు.