అర‌బిందో, డాక్ట‌ర్ రెడ్డీస్ లపై అమెరికాలో కేసు  

భార‌త్‌కు చెందిన అర‌బిందో ఫార్మా, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ‌రేట‌రీస్‌పై అమెరికా కోర్టులో ఫైజ‌ర్ కంపెనీ కేసు దాఖ‌లు చేసింది.  త‌మ క్యాన‌ర్స్ ఔష‌ధం ఇబ్రాన్స్ ‌(పాల్బోసిక్లిబ్‌) పేటెంట్ కాలం ముగియ‌క‌ముందే.. భార‌తీయ ఫార్మా కంపెనీలు త‌మ ఔష‌ధానికి చెందిన జ‌న‌రిక్ వ‌ర్షిన్‌ను త‌యారు చేస్తున్న‌ట్లు ఫైజ‌ర్ కంపెనీ ఆరోపించింది. 

డెలావేర్ జిల్లాలోని కోర్టులో ఫైజ‌ర్ త‌న పిటిష‌న్ దాఖ‌లు చేసింది. బ్రెస్ట్ క్యాన్స‌ర్ చికిత్స‌లో పాల్బోసిక్లిబ్ ఔషధాన్ని చాలా విరివిగా వాడుతున్నారు.  క్యాన్స‌ర్ క‌ణాల వృద్ధిని ఆ డ్ర‌గ్ నిలిపివేస్తుంది. ఈ ఔష‌ధానికి అమెరికా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న‌ది.  

గ‌త ఏడాది ఆ డ్ర‌గ్ అమ్మ‌కాలు 5 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది.  అయితే ఇబ్రాన్స్ డ్ర‌గ్‌కు సంబంధించి జ‌న‌రిక్ వ‌ర్ష‌న్ త‌యారీకి అనేక కంపెనీలు ఎఫ్‌డీఏ వ‌ద్ద ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి. 

ఫైజ‌ర్ డ్ర‌గ్ పేటెంట్ వాస్త‌వానికి 2023లో ముగియాల్సి ఉన్న‌ది. కానీ దాని క‌న్నా ముందే ఆ డ్ర‌గ్ ఉత్ప‌త్తి కోసం భార‌తీయ కంపెనీలు ఎఫ్‌డీఏకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డాన్ని ఫైజ‌ర్ త‌ప్పుప‌ట్టింది.