
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు . ఈ ఎన్నికల్లో జనసేనతో ఎలాంటి పొత్తు లేదని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీతో జనసేన పొత్తు ఏపీ వరకే పరిమితమని, తెలంగాణకు వర్తించదని స్పష్టత ఇచ్చారు.
జనసేనతో పాటు ఏ పార్టీతోనూ పొత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం తమ పార్టీ ప్రధాన ప్రత్యర్ధి అని ఆయన చెప్పారు. పొత్తుల విషయంలో ఇప్పటివరకు కూడ ఏ పార్టీ తమను సంప్రదించలేదని ఆయన తెలిపారు.
అంతేకాదు ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని…మొత్తం 150 డివిజన్లలో తమ అభ్యర్థులను నిలబెడతామని సంజయ్ స్పష్టం చేశారు. దుబ్బాక ఫలితాలే హైదరాబాద్‌లో రిపీట్ అవుతాయని, గ్రేటర్‌లో గెలిపిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని పేర్కొన్నారు
మరోవంక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పోటీ చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. యువ కార్యకర్తల విజ్ఞప్తి ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
More Stories
రెండు గంటల్లో హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం!
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు