విగ్రహ వివాదం లో వాస్తవం ! నిజం టుడె ఫాక్ట్ చెక్

సిద్దిపేట జిల్లాలో విగ్రహ ఏర్పాటు అంశం వివాదానికి దారి తీసింది. సోషల్ మీడియా లో రక రకాలుగా జరుగుతున్న ప్రచారాలపై నిజం టుడె ఫాక్ట్ చెక్ !

దౌలతాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో వినాయక మైదానం ఉన్నది . ప్రతీ ఏటా అక్కడే వినాయక విగ్రహం పెట్టి చవితి పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి చోట సడెన్ గా అంబేడ్కర్ విగ్రహం పెట్టేందుకు కొందరు ప్రయత్నించారు. దీని విషయంలో కొందరు అన్య మత ప్రచారకులు పట్టు పట్టారు. విగ్రహం ఏర్పాటుకు గువ్వలేగి గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. వినాయక మండప ప్రదేశాన్ని వదిలేసి గ్రామంలో ఎక్కడైనా విగ్రహం పెట్టుకుందామని చెప్పారు. కానీ దీనికి అన్య మత ప్రచారకులు ఒప్పు కోలేదు.  అక్కడే విగ్రహం పెడుదామంటూ కొందరు యువకులను రెచ్చ గొట్టారు. దీంతో రెండు పక్షలకు వాదన రేగింది.  ఈ లోగా పోలీసులు చేరుకొన్నారు. ఆ మైదానంలో ఈ విగ్రహము పెట్టకుండా సర్దు బాటు చేశారు.

అయితే ఈ అంశంలో  ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల జోక్యం ఉందని కొందరు ప్రచారం చేశారు. వాస్తవానికి ఆ గ్రామంలో ఆర్ ఎస్ ఎస్ శాఖ గాని , ప్రచారకులు కానీ లేనే లేరు. అయిన సరే కొందరు ఉద్దేశ పూర్వకంగా ఆర్ ఎస్ ఎస్ పేరు ఇరుకించారని నిజం టుడె పరిశీలనలో తేలింది.