డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడి నివాసంపై దాడులు  

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ నివాసంపై ఎన్‌సీబీ బృందం సోమవారంనాడు దాడులు నిర్వహించింది. బాంద్రా నివాసం, కార్యాలయం సహా మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు. 

ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని రాంపాల్‌కు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. అంతకు ముందు ఎన్‌సీబీ అధికారులు అర్జున్‌ రాంపాల్‌ నివాసంపై దాడులు నిర్వహించారు. కొన్ని గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. 

ఈ సందర్భంగా డ్రగ్స్‌కు సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాలను ముగిసిన కొద్దిసేపటికే ఆయనకు సమన్లను జారీ చేశారు.

కొన్ని గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాలను ముగిసిన కొద్దిసేపటికే ఆయనకు సమన్లను జారీ చేశారు.

ఇదే కేసులో ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నడియడ్‌వాలా భార్య షబానా షహీద్‌‌ను ఆదివారంనాడు అరెస్టు చేసిన నేపథ్యంలో తాజా దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కాగా, గత అక్టోబర్‌లో అర్జున్ రాంపాల్ పార్టనర్ గాబ్రియేలా డెమెత్రియేడ్స్ సోదరుడు అగిసిల్లాస్‌ను ఇదే డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ అరెస్టు చేసింది. అగిసిల్సాస్ మాదకద్రవ్యాలు కలిగి ఉండటంతో లోనావాలా రిసార్ట్‌లో అతన్ని పోలీసులు పట్టుకున్నారు. 

దక్షిణ ఆఫ్రికా సంతతికి చెందిన అగిసిలోస్  వద్ద గంజాయి, ఇతర డ్రగ్స్ స్వాధీన చేసుకున్నారు. ఎన్‌డీపీసీ చట్టంలోని సెక్షన్ 27 కింద ఆయనపై కేసు పెట్టారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అర్జున్ రాంపాల్ నివాసంపై ఎన్‌సీబీ దాడులు జరిపింది. 

గత జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో డ్రగ్స్ మాఫియాతో బాలీవుడ్ సంబంధాలను ఛేదించేందుకు ఎన్‌సీబీ వరుస దాడులు జరుపుతోంది.