
బీహార్ లో మూడు దశల పోలింగ్ పూర్తి కావడంతో రెండు కూటముల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు శనివారం సాయంత్రం వచ్చిన పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి చేశాయి. రెండు కూటముల మధ్య సీట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో ఎవరు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠిస్తారో అన్న తీవ్ర ఉత్రంఠ నెలకొన్నది.
మొత్తం 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122 ను దాదాపుగా ఏ కూటమి సాధించుకోలేక పోవచ్చని వెల్లడి అవుతున్నాయి. అయితే ఆర్జేడీ, బీజేపీ తమ సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకొని అతిపెద్ద పార్టీలుగా తమ కూటమిలలో మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిషన్ చాణక్య సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమికి 128 సీట్లతో అతి పెద్ద కూటమిగా అవతరిస్తుండగా, యూపీఏ గట్టిపోటీ ఇస్తున్నది. ఈ కూటమికి 105 స్థానాల్లో విజయం వరించే అవకాశాలు ఉన్నాయి. మరో 10 స్థానాల్లో ఇతరులు గెలిచే అవకాశం ఉన్నది.
పీపుల్స్ పల్స్ వారి సర్వే ప్రకారం.. జేడీయూ, దాని మిత్రులు 75 నుంచి 105 స్థానాల్లో గెలుపొందుతుండగా, ఆర్జేడీ 95 నుంచి 120 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయనున్నది. ఇతరులు 5 నుంచి 18 స్థానాల్లో తమ ఉనికిని చాటుకోనున్నారు.
టైమ్స్ నౌ, సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం యూపీఏ లీడ్‌లో ఉన్నది. యూపీఏ కూటమికి 120 సీట్లు వచ్చే అవకాశాలు ఉండగా.. ఎన్డీఏ కూటమికి 116 స్థానాలు, లోక్‌జనశక్తి పార్టీకి ఒక స్థానంలో, ఇతరులు ఆరు సీట్లలో గెలువనున్నారు.
వీరి సర్వే ప్రకారం బీజేపీకి 53, జేడీయూకు 71, ఆర్జేడీకి 80, కాంగ్రెస్ 27 స్థానాల్లో, వామపక్షపార్టీలు 10, ఎల్జేపీ 2, హెచ్‌ఏఎం 2, వీఐపీ పార్టీ 2, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించనున్నారు.
ఇక రిపబ్లిక్ టీవీ, జన్ కి బాత్ సర్వే ప్రకారం.. అతిపెద్ద కూటమిగా యూపీఏ నిలువనున్నది. యూపీఏకు 118 నుంచి 138 స్థానాలు, ఎన్డీఏకు 91 నుంచి 117 సీట్లు, ఎల్జేపీకి 5 నుంచి 8, ఇతరులు 3 నుంచి 6 స్థానాల్లో గెలువనున్నారు.
టీవీ9, భారత్‌వర్ష్ సర్వే ప్రకారం కూడా యూపీఏ అతిపెద్ద కూటమినిగా నిలుస్తున్నది. యూపీఏకు 120.. ఎన్డీఏకు 116 సీట్లు, ఎల్జేపీకి 1, ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించనున్నారు. అన్ని పోల్స్ సగటు ప్రకారం యూపీఏకు 123, ఎన్డీఏకు 112 స్థానాలు, ఎల్జేపీకి 4, ఇతరులు 4 సీట్లలో గెలుపొందనున్నారు.
ఏబీపీ, సీ ఓటర్ సర్వే ప్రకారం.. ఎన్డీఏ అతిపెద్ద కూటమిగా నిలువనున్నది. వీరి సర్వే ప్రకారం ఎన్డీఏకు 104 నుంచి 128 సీట్లు, యూపీఏకు 108 నుంచి 121 సీట్లు లభించనున్నాయి. ఇతరులు 5 నుంచి 12 స్థానాల్లో గెలుస్తారు.
ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించనున్నది. ఆర్జేడీ, మిత్రులకు 120 సీట్లు, ఎన్డీఏకు 116 సీట్లు, ఎల్జేపీ, ఇతరులు ఒక స్థానంలో గెలువనున్నారు.
ఈటీజీ సర్వే ప్రకారం కూడా యూపీఏ అతిపెద్ద కూటమిగా నిలిచింది. యూపీఏకు 120 సీట్లు, ఎన్డీఏకు 114 సీట్లు, ఎల్జేపీకి 3, ఇతరులు 6 స్థానాల్లో గెలువనున్నారు.
More Stories
భారతదేశ వారసులు హిందువులే
భారత్ లో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా నిధులు?
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట