భారీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల నకిలీ దరఖాస్తులు !

భారీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల నకిలీ దరఖాస్తులు !

వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్యెల్సీ ఎన్నికలలో ఎట్లాగైనా గెలుపు సాధించాలని అధికార పక్షం పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను చేర్పిస్తున్నట్లు తెలుస్తున్నది. నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం బోగస్​ అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. 

గత ఎన్నికల్లో 2.89  లక్షల మంది ఓటర్లు ఉండగా  ఈసారి అనూహ్యంగా 4.15 లక్షల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వెరిఫికేషన్​లో పెద్దసంఖ్యలో అప్లికేషన్లు రిజెక్ట్​ అవుతుండటం చర్చనీయాంశమైంది. ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్  చేస్తున్న అధికారులపై రాజకీయ వత్తిడి పెరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఓటర్ల చేర్పింపు  కార్యక్రమాన్ని సీరియస్​గా తీసుకోవాలని, వీలైనంత ఎక్కువ మందిని ఓటర్లుగా చేర్చాలని ఎమ్మెల్యేలకు టీఆర్​ఎస్​ హైకమాండ్​ఆదేశాలు జారీచేసింది. దీంతో రంగంలోకి దిగిన టీఆర్​ఎస్​ నేతలు జోరుగా ఓటర్లను చేర్పించారు.

గ్రాడ్యుయేట్లకు ఎన్​రోల్​మెంట్​ ఫారాలు అందజేసి తిరిగి వాటినివసూలు  చేయడంతోపాటు, ప్రత్యేక క్యాంపు ఆఫీసులు పెట్టి మరీ ఆన్​లైన్​లో చేర్పించారు. ఈ క్రమంలో ఆఫ్​లైన్​ కంటే ఆన్​లైన్​లోనే ఎక్కువ దరఖాస్తులు ​వచ్చాయి. ఆన్​లైన్​లో వచ్చిన దరఖాస్తులలో చాలా వరకు బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ముఖ్యంగా అధికార ​పార్టీ ఈ తరహా బోగస్​ ఓటర్ల నమోదుకు పాల్పడిందని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులు కూడా అందాయి. ఓటర్ల చేర్పింపు నేటితో  ముగుస్తున్నందున ఆన్​లైన్​లో వచ్చిన దరఖాస్తుల  వెరిఫికేషన్  ప్రకియ​ను  పారదర్శకంగా చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్​చేస్తున్నాయి.

నల్గొండ– ఖమ్మం– వరంగల్  సెగ్మెంట్​లో ఈ నెల 4 నాటికి 4.15 లక్షల మంది ఎన్​రోల్​చేసుకున్నారు. వీటిలో ఆన్​లైన్​ దరఖాస్తులు   3 లక్షల 32 వేల 56 9 రాగా.. ఆఫ్​లైన్​లో కేవలం 82 వేల 541 అప్లికేషన్స్​ వచ్చాయి.  ఇప్పటివరకు బీఎల్​వోలు సుమారు లక్ష ఫారాలపై పరిశీలన పూర్తి చేశారు. ఇందులో ఆన్​లైన్​ అప్లికేషన్లు 22,035 ఉన్నాయి.

మొత్తం 1,070 ఫారాలను రిజెక్ట్ చేయగా,వాటిలో ఆఫ్​లైన్​ ఫారాలు  150,  మిగిలిన  920 ఆన్​లైన్​ఫారాలు.  వీటిలో చాలా దరఖాస్తులలో బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్లు తెలుస్తున్నది. అధికారులు  మాత్రం బయటకు చెప్పడం లేదు.

ఇప్పటి వరకు జరిగిన వెరిఫికేషన్​లో డిగ్రీ సర్టిఫికెట్లపైన ఫొటోలు సరిగ్గా లేకపోవడం, తప్పుడు అడ్రస్​లు,  డిగ్రీ ఫెయిల్ అయినవాళ్ల సర్టిఫికెట్లు కనిపిస్తున్నాయని, 2017 తర్వాత డిగ్రీ పాసైన వాళ్లు కూడా అప్లై చేశారని బీఎల్​వోలు చెబుతున్నారు.

కాగా,  నకిలీ సర్టిఫికెట్లపై  ప్రత్యేక దృష్టి పెట్టామని బీఎ ల్​వోలు ఓకే  చేసిన ఫారాలపై తహశీల్దారు ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్లు తప్పనిసరిగా గెజిటెడ్ సంతకం పెట్టాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. బోగస్  ఓటర్ల ఏరివేత కోసం తహసీల్ ఆఫీసుల్లో డిజిగ్నేటెడ్​ఆఫీసర్ల హోదాలో డీటీలను నియమించామని చెబుతున్నారు.