దేశీయ ఉక్కు తయారీ సంస్థ టాటా స్టీల్ తన ఉద్యోగుల కోసం కొత్త వర్క్ మోడల్‌ను ప్రకటించింది. ఇందులో సంవత్సరానికి 365 రోజులు ఇంటి నుంచే పని చేసేందుకు వీలు కలుగనుంది. తన ఉద్యోగులకు మరింత వెసులుబాటును ఇచ్చేందుకు ‘ట్రస్ట్ అండ్ రిజల్ట్ బేస్డ్ వర్కింగ్ కల్చర్’ దిశగా అడుగులు వేస్తున్నది కంపెనీ తెలిపింది.
నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వర్కింగ్ మోడల్ కింద నిర్దిష్ట ప్రదేశం నుంచి బయటకు రావాల్సిన అధికారులు కూడా ఇంటి నుంచే సంవత్సరంలో అపరిమిత రోజులు పని చేయవచ్చని చెప్పింది. మహమ్మారి పరిస్థితి సాధారణీకరించిన తర్వాత.. ఈ విధానం సంస్థ అధికారులను ఇష్టపడే ప్రదేశానికి తరలించడానికి వీలు కల్పిస్తుందని తెలిపింది.
దేశంలో ఎక్కడా నుంచైనా పని చేసేందుకు ఉద్యోగికి సౌకర్యం కల్పిస్తోంది. సంవత్సరం పాటు పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తామని, అనుకూలత, అభిప్రాయాలను సేకరించి.. సంవత్సరం తర్వాత పాలసీపై సమీక్షించనున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా టాటా స్టీల్ హెచ్‌ఆర్ ఉపాధ్యక్షుడు సురేష్ దత్ త్రిపాఠి మాట్లాడుతూ సౌకర్యవంతమైన పని రాబోయే తరాల కోసం ఒక పని ప్రాంతాన్ని సృష్టించాలనే సంస్థ ఉద్దేశమే కాకుండా, భౌగోళిక ప్రాంతాల్లో దాని వైవిధ్యభరితమైన శ్రామిక శక్తి అవసరాలను తీర్చడంలో సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉత్పాదకత సాంప్రదాయిక ఆలోచన నుంచి కార్యాలయ వాతావరణంలో నిర్ణీత గంటలు పని చేయడం, రిమోట్ వర్కింగ్ చుట్టూ ఉన్న అనేక అపోహలను విడదీసేందుకు కరోనా మహమ్మారి ఉపయోగపడిందని త్రిపాఠి తెలిపారు.
సౌకర్యవంతమైన పని ప్రదేశాలను ఎన్నుకోవడానికి, కుటుంబాలను పోషించుకోవడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ స్వేచ్ఛను అందిస్తుందని, బదిలీ చేయలేని ఉద్యోగాలతో వృద్ధాప్య తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములతో కలిసి ఉండేందుకు సహకరిస్తుందని పేర్కొన్నారు.
అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన ఉద్యోగులను కాపాడుకునేందుకు, సంపన్నం చేయడానికి, శ్రామిక శక్తిని ఆకర్షించేందుకు సహాయ పడుతుందని త్రిపాఠి పేర్కొన్నారు.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ