న్యూజిలాండ్ మంత్రిగా మలయాళీ మహిళ

న్యూజిలాండ్ మంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసిన మొదటి భారతీయ మహిళ ప్రియాంక రాధాకృష్ణన్. న్యూజిలాండ్  ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ సోమవారం కొత్త మంత్రివర్గాన్ని ఆవిష్కరించారు.

41 ఏళ్ల ప్రియాంక కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలో పుట్టి సింగపూర్‌లో పెరిగిన ఆమె కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో పరవూర్ కు చెందిన వ్యక్తి. అక్కడ ఆమె తాత వైద్య నిపుణులు, కమ్యూనిస్టు కూడా.  

ఆక్లాండ్ నుండి రెండుసార్లు ఎంపి అయిన ప్రియాంక ఉన్నత విద్యను అభ్యసించడానికి న్యూజిలాండ్ చేరుకుంది. ఆ తర్వాత ఆమె. క్రైస్ట్‌చర్చ్‌కు చెందిన రిచర్డ్‌సన్ ను వివాహమాడింది. 2004 నుండి లేబర్ పార్టీలో చురుకైన పాత్రను పోషించారు. 

2017 లో తొలిసారిగా న్యూజిలాండ్ పార్లమెంటులో ప్రవేశించిన ప్రియాంక, వారసత్వ శాఖకు పార్లమెంటరీ ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఎంపిగా రెండోసారి ఎన్నికయ్యారు.