సిజెఐకి జగన్ లేఖ కోర్ట్ దిక్కారమే 

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్రాసిన లేఖ   కచ్చితంగా కోర్టు ధిక్కారమేనని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సీజేఐకి రాసిన లేఖను బహిర్గతం చేయడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని  తేల్చి చెప్పారు. 

గతంలో ఏపీ సీఎం జగన్‌పై కోర్టు ధిక్కారం కేసు నమోదుకు అనుమతి కోరుతూ కేకే వేణుగోపాల్‌కు అశ్వినీ ఉపాధ్యాయ వ్రాసిన లేఖకు సమాధానంలో వ్రాసిన లేఖలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పైగా, ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి జస్టిస్‌ ఎన్వీరమణ తీర్పు తర్వాత ఈ లేఖ రాయడం అనేక అనుమానాలకు దారి తీస్తోందని అయాన్ పేర్కొన్నారు. అన్ని విషయాలు సీజేఐకి తెలుసని చెబుతూ  ప్రత్యేకంగా కోర్టు ధిక్కారం కోసం తాను అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

ఇప్పటికే జగన్‌పై 31 కేసులు ఉన్నాయని లేఖలో అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ఈ  సందర్భంగా గుర్తు చేశారు.