కరోనాతో తమిళనాడు మంత్రి మృతి 

త‌మిళ‌నాడు వ్య‌వ‌సాయశాఖ మంత్రి దొరైక్క‌న్ను (72) క‌రోనాతో మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా క‌రోనా చికిత్స పొందుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌య‌మించ‌డంతో గత అర్థ‌రాత్రి 11.15 గంట‌ల‌కు క‌న్నుమూశారు. 
 
అక్టోబ‌ర్‌ 13న శ్వాస‌తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ‌టంతో వెంట‌నే ఆయ‌న‌ను విల్లుపురం ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో చేరారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం కావేరీ ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా అక్క‌డ క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న చికిత్స పొందుతున్నారు. 
 
శనివారం మంత్రి దొరైక్కన్ను ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తుల్లో 90 శాతం మేరకు ఇన్‌ఫెక్షన్ చేరినట్టు సీటీ స్కాన్‌లో వెల్లడయ్యింది.  1948లో తంజావూరు జిల్లా రాజ‌గిరిలో జ‌న్మించిన దొరైక్క‌న్ను మూడుసార్లు పాప‌నాశం అసెంబ్లీ స్థానం నుంచి గెలుసొందారు. 2016లో సీఎం పళ‌నిస్వామి కేబినెట్‌లో వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ‌
 
దొరైక్కన్నుకు భార్య, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంత్రి దొరైక్కన్ను మృతిపై సీఎం పళనిసామి, తమిళనాడు గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ విచారం వ్యక్తం చేశారు. మంతి మంత్రి దొరైక్కన్ను అకాల మరణం తమిళనాడు ప్రజలకు, అన్నాడీఎంకే పార్టీకి కోలుకోలేని నష్టమని గవర్నర్ పేర్కొన్నారు.