జేమ్స్‌బాండ్ సిరీస్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించుకున్న ప్రముఖ హాలీవుడ్ నటుడు సీన్ కానరీ (90) శనివారం కన్నుమూశారు. ‘బాండ్…జేమ్స్‌బాండ్’ అంటూ సిగ్నేచర్ ైస్టెల్‌తో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు గూఢచారి జేమ్స్‌బాండ్ పాత్రలకు సీన్ కానరీ ప్రాణప్రతిష్ట చేశారు.
1962 నుంచి 1983 మధ్య ‘డాక్టర్.నో’ సినిమా మొదలుకొని ‘యూ ఓన్లీ లివ్ ట్వైస్’ వరకు ఏడు జేమ్స్‌బాండ్ సిరీస్ చిత్రాల్లో నటించారు. ‘ది అన్‌టచబుల్స్’ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.
మార్నీ, మర్డర్ ఆన్‌ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్, ది మెన్ హూ ఉడ్ బి కింగ్, ది నేమ్ ఆఫ్ ది రోజ్, హైలాండర్, ఇండియానా జోన్స్ అండ్ ది లాస్డ్ క్రూసేడర్, ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్, డ్రాగన్‌హార్ట్, ది రాక్, ఫైండింగ్ ఫారెస్టర్ చిత్రాలు పేరుతెచ్చాయి.
1989లో 59ఏళ్ల వయసున్న అయన్ని పీపుల్స్‌మ్యాగజైన్ ‘సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్’గా ప్రకటించింది. సీన్ కానరీ ఇంగ్లాండ్‌లోని స్కాట్లాండ్‌లో జన్మించారు. రంగస్థల నటుడిగా కెరీర్‌ను ఆరంభించారు.
‘సినిమా చరిత్రలోనే మూడో ఉత్తమ హీరో’ అని అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ సీన్ కానరీకి జీవిత సాఫల్య పురస్కారం అందించింది. ఆ సమయంలోనే నటనకు స్వస్తి చెబుతున్నట్లు సీన్ ప్రకటించారు.
More Stories
లెబనాన్, సిరియాలలో ఒకేసారి పేలిపోయిన వేలాది ‘పేజర్లు’
ఆసియా చాంఫియన్స్ హాకీ ట్రోఫీ విజేత భారత్
రష్యాలో పిల్లల కోసం భోజన విరామంలో శృంగారం