జమ్ముకశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఆపరేషనల్ చీఫ్ సైఫుల్లా మృతి చెందాడు. మరో ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. శ్రీనగర్‌లోని రంగ్రేత్ ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు శనివారం రాత్రి సమాచారం అందించింది.
దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదులు దాగినట్లు అనుమానించిన ప్రాంతానికి చేరగానే మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు.
దీంతో భద్రతా దళాలు ప్రతిగా కాల్పులు జరుపగా హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ సైఫుల్లా మీర్ అలియాస్ ఘాజీ హైదర్ అలియాస్ డాక్టర్ సహబ్ మరణించాడు.
పుల్వామా జిల్లాలోని మలంగ్‌పోరాకు చెందిన అతడు 2014 అక్టోబర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరినట్లు కశ్మీర్ ఐజీ తెలిపారు. రియాజ్ నాయకూ అతడ్ని నియమించి ఘాజీ హైదర్ అని పేరు పెట్టినట్లు చెప్పారు.
ఇది భద్రతా బలగాలు సాధించిన పెద్ద విజయమని ఐజీ పేర్కొన్నారు. ముగ్గురు బీజేపీ కార్యకర్తల ఎన్‌కౌంటర్ వెనుక సైఫుల్లా హస్తముందని పోలీసులు ప్రకటించి…. 72 గంటలు గడిచింది. ఈ 72 గంటల్లోనే సైన్యం సైఫుల్లాను మట్టుబెట్టడం విశేషం.
More Stories
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష
శ్రీహరికోటలో మూడవ లాంచ్‌ప్యాడ్