బంగారం అక్రమ రవాణా కోసం కేరళ ప్రభుత్వ వాహనాలను ఉపయోగిస్తున్నారని బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ సంచలన ఆరోపణ చేశారు.
కేరళలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడం కోసం అనేక రాష్ట్ర ప్రభుత్వ వాహనాలను, క్రీడా మండలి అధ్యక్షుడి కారును ఉపయోగించారని తెలిపారు.
పలు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అనేక విధాలుగా ఈ దందాకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు. కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు బినామీ ఆస్తులు ఉన్నాయని, హవాలా లావాదేవీలు నడుపుతోందని ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు. నేరస్థులకు రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక శాఖలు సహకరిస్తున్నాయని ధ్వజమెత్తారు.
కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెండ్ అయిన ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి వద్ద మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం శివశంకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయనను దాదాపు 6 గంటలపాటు ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేశారు.
More Stories
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
రూ.1,800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఎన్నికల బాండ్ల పథకంపై తీర్పు సమీక్షకు `సుప్రీం’ నిరాకరణ