6 లక్షల టెలికన్సల్టేషన్లు పూర్తి చేసిన ఈ-సంజీవని   

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ టెలిమెడిసిన్ కార్యక్రమం ఈ-సంజీవని విజయవంతంగా 6 లక్షల టెలికన్సల్టేషన్లను పూర్తిచేసింది. చివరి లక్ష కన్సల్టేషన్లు పూర్తి చేయడానికి కేవలం15 రోజులు మాత్రమే పట్టింది. 
 
ప్రధానమంత్రి ‘డిజిటల్ ఇండియా’ చొరవకు పెద్ద ఊతం ఇచ్చేలా, ఈ-సంజీవని డిజిటల్ ప్లాట్‌ఫాం దాని ప్రయోజనం, సంరక్షకులకూ, వైద్య సమాజానికి, కోవిడ్ కాలంలో ఆరోగ్య సేవలను కోరుకునేవారికి సులువుగా అందుబాటులో ఉంటుందని నిరూపించింది.
 
తమిళనాడు, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాలు రోజుకు 12 గంటలు, వారానికి 7 రోజులు ఈ-సంజీవని ఒపిడి నడుపుతున్నాయి. రోగులు, వైద్యులతో ఈ-సంజీవని క్రమంగా మమేకం అవుతుంది అనడానికి ఇదే నిదర్శనం. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలకు సంజీవని అందుబాటులో ఉన్నది. 
 
217 ఆన్‌లైన్ ఓపిడీలను, ఇన్‌పేషెంట్ అయిన వారికి 6,000 మంది పైగా వైద్యుల ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫాం ఈ-హెల్త్ సేవలను అందిస్తున్నది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రత్యేక ఆరోగ్య సేవలను ఈ-సంజీవని (ఏబి-హెచ్డబ్ల్యూసి) ద్వారా విస్తరిస్తున్నది. 
 
ఇది 175 కేంద్రా‌ల (జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలలలో ఏర్పాటు చేసిన)తో అనుసంధానించిన 4,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో పనిచేస్తుంది. 20,000 మంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం, ఈ-సంజీవని రోజుకు 8500 కి పైగా కన్సల్టేషన్లు నమోదు అవుతున్నాయి.