బంగారం స్మగ్లింగ్ కేసులో  శివశంకర్ కు బెయిల్ నిరాకరణ

కేరళను కుదిపివేస్తున్న రూ.14.82కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం  శివశంకర్ కు  ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్ట్ నిరాకరించింది.

ఈ ఏడాది జులై నెలలో యూఏఈ నుంచి తిరువనంతపురం వచ్చిన ప్రయాణికుల వద్ద నుంచి సుమారు రూ.14.82కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ  కేరళ సీఎం పినరయి విజయన్ మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి శివశంకర్,   స్వప్న సురేష్ లు ఉన్నట్లు కష్టమ్స్ అధికారులు గుర్తించారు. 

నిందితులకు ముఖ్యమంత్రి కార్యాలయంతో సంబంధాలున్నాయని, అందువల్ల నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో పలువురు అధికారుల్ని వేరే శాఖలకు బదిలీ  చేశారు. మరికొంతమందిని సస్పెండ్ చేశారు. వారిలో  శివశంకర్ కూడా ఉన్నారు. ఈ కేసు విచారణ జరుగుతుండగానే ఆయన అస్వస్థత గురయ్యారు.

అదే సమయంలో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కేరళ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ దాఖలపై విచారణ జరిగే సమయంలో శివకుమార్ అస్వస్థత అంతా బూటకమని, తన భార్య పని చేసే ఆసుపత్రిలోనే శివశంకర్ కావాలనే అడ్మిట్ అయ్యారని, ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ ను అనుమతించవద్దని కస్టమ్స్ శాఖ కోర్టును కోరింది.  దీంతో కోర్ట్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

బెయిల్ కు ముందే తనని దర్యాప్తు బృందం 90 గంటలు విచారించిందని, అందులో తనకు వ్యతిరేకంగా ఎలాంటి రిపోర్ట్ సమర్పించలేదని శివశంకర్ పేర్కొన్నారు. కాగా కేరళ కోర్ట్ శివకుమార్ కు బెయిల్ రద్దు చేయడంతో మరోసారి సీబీఐ అధికారులు ఆయన్ని ప్రశ్నించనున్నారు.