
నకిలీ బిల్లులతో రూ.500 కోట్ల లావాదేవీలతో సాగుతున్న భారీ నెట్‌వర్క్ రాకెట్‌పై సిబిడిటి (ప్రత్యక్ష పన్నుల విభాగం) అధికారులు సోమవారం దాడులు జరిపి రూ.5.26 కోట్ల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం ఢిల్లీఎన్‌సిఆర్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. భారీ ఎత్తున ఈ హవాలా రాకెట్ నడుస్తోందని నకిలీ బిల్లులు సృష్టించి అకౌంట్‌లో జమకాని పెద్ద ఎత్తున నగదు ఈ విధంగా బినామీ సంస్థల పేరున లావాదేవీలు నడుపుతున్నారని చెప్పారు.
ఈ దాడుల్లో 17 బ్యాంక్ లాకర్లలో రూ.2.37 కోట్ల నగదు, రూ.2.89 కోట్ల విలువైన నగలు పట్టుబడింది. ఇంకా సోదాలు సాగుతున్నాయి. రూ.500 కోట్లకు మించి హవాలా రాకెట్ సాగుతోందని డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోందని అధికారులు వివరించారు.
కొంతమంది బ్యాంకు అధికారులతో కుమ్మక్కు అయి కొంతమంది లాకర్ల, బ్యాంకు అకౌంట్ల యజమానులు తమ కుటుంబ సభ్యుల పేరున బినామీ వ్యవహారం దీని ద్వారా సాగిస్తున్నారని బయటపడిందని అధికారులు వివరించారు.
More Stories
యూపీఐ లావాదేవీలకు రూ. 1500 కోట్ల ప్రోత్సాహకాలు
బంగారం అక్రమ రవాణాలో రన్యానే సూత్రధారి!
జార్జ్ సోరస్ ఫౌండేషన్ లబ్ధిదారులపై ఈడీ సోదాలు