రఘునందన్‌‌‌‌‌‌‌‌ వాహనం‌‌‌‌‌‌‌‌ 20 సార్లు తనిఖీ….కిషన్ రెడ్డి ఆగ్రహం 

దుబ్బాకలో ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌ అమల్లోకి వచ్చిన తర్వాత బీజేపీ అభ్యర్థి రఘునందన్‌‌‌‌‌‌‌‌ వాహనంను పోలీసులు ఇప్పటివరకు 20 సార్లు తనిఖీ‌‌‌‌ చేశారు. ఆయన అనుచరుల వాహనాలనూ గంటలకొద్దీ సేపు తనిఖీ చేశారు. ఈ వారం రోజుల్లో సిద్దిపేట, మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో రఘునందన్‌‌‌‌‌‌‌‌ వాహనంను మూడు సార్లు తనిఖీ‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యకర్తల వాహనాల టైర్ల గాలి తీసి మరీ చూశారు. 

బీజేపీ కార్యకర్త వంశీకృష్ణ వెహికల్‌‌‌‌‌‌‌‌ను గత మంగళవారం తుప్రాన్‌‌‌‌‌‌‌‌లో మూడు గంటల పాటు తనిఖీ చేసి అదే రోజు రాత్రి దుబ్బాకలో 9 గంటలు తనిఖీ చేశారు. సోమవారం రఘునందన్ మామ ఇంట్లో సోదాల సందర్భంగా పోలీసులు బూట్లతో ఇంట్లో తిరుగుతూ హంగామా చేశారు. పసిపాప పైనుంచి దాటుకుంటూ తిరిగారు.

ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ముసుగులు వేసుకున్న మఫ్టీ పోలీసులు తన మామ రాంగోపాల్ రావు ఇంట్లో సోదాలు ఎలా నిర్వహిస్తారని రఘునందన్‌‌‌‌ రావు ప్రశ్నించారు.  ఇంట్లోకి  రాగానే తన భార్యతో పాటు ఇంట్లోని వారి ఫోన్లను లాక్కొని మాట్లాడనివ్వకుండా చేశారని చెప్పారు. 

తన కుటుంబ సభ్యులు ఎవరూ ఫోన్​లో అందుబాటులోకి  రాకపోవడంతో ఏం జరుగుతున్నదని ఆరా తీయగా, తన మామ ఇంటికి పెద్దసంఖ్యలో పోలీసులు వచ్చిన విషయం తెలిసిందని చెప్పారు. సోదాల్లో ఎలాంటి డబ్బు దొరకలేదని అంటూ తమ ఇంటికి వచ్చిన వారు పోలీసులో కాదో తెలియని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. 

తమ కుల పెద్ద ఇంట్లో డబ్బులు దొరికితే అవి తనవని చెబుతున్న తీరు, అప్రజాస్వామికమని మండిపడ్డారు. సోదాల సందర్భంగా పోలీసులు అమానవీయంగా వ్యవహరించారని, ఇంట్లో పసిగుడ్డును కాళ్లతో తన్నడమే కాకుండా ఇల్లంతా చిందర వందర చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిషన్ రెడ్డి ఆగ్రహం 

కేంద్రసహాయ మంత్రి కిషన్‌ రెడ్డి రఘునందన్‌రావు ఇంటికి వెళ్లి సెర్చ్‌ వారెంట్‌ లేకుండా తనిఖీలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోని వస్తువులను చెల్లాచెదురు చేశారని విస్మయం వ్యక్తం చేశారు. మహిళలపై అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. 

టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, పోలీసులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో న్యాయనిర్ణేతలు ప్రజలేనని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.