
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో అధికార పక్షం అసహననానికి గురవుతున్నది. బిజెపి అభ్యర్థి రఘునన్దనరావుకు లభిస్తున్న అనూహ్య మద్దతు టి ఆర్ ఎస్ అధినాకత్వంలో ఖంగారు కలిగిస్తున్నది.
ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి బంధువుల ఇంట్లో, కార్యాలయాల్లో పోలీసులు సోమవారం సోదాలు చేపట్టారు. రఘునందన్ రావు అత్తగారిల్లు, సమీప బంధువుల ఇళ్లతో సహా ఎనిమిది చోట్ల ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు.
ఇదిలావుండగా పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, కార్యకర్తలు నిరసనకు దిగారు. పోలీసుల దాడుల విషయం తెలసుకున్న రఘునందన్ రావు ప్రచారం మధ్యలోనే ఆపేసి వెంటనే సిద్ధిపేట చేరుకున్నారు. ఏ సెక్షన్ ప్రకారం తన ఇంట్లో సోదాలు చేశారో చెప్పాలంటూ పోలీసులను నిలదీశారు.
కనీసం తన భార్యతో ఫోన్ కూడా మాట్లాడనివ్వలేదని పోలీసులను ప్రశ్నించారు. తన ఇంట్లో ఇప్పటివరకు ఏం స్వాధీనం చేసుకున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనను మాత్రమే టార్గెట్ చేసి సోదాలు చేయడమేంటని ప్రశ్నించారు.
దుబ్బాకలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ పోలీసులతో దాడులు చేయిస్తోందని రఘునందనరావు ఆరోపించారు.ప్రస్తుతం ఇంటిముందు కార్యకర్తలతో కలిసి తన ఇంటిముందు బైఠాయించారు రఘునందన్. తన ఇంట్లో వెళ్లేందుకు రఘునందన్ ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తలు పెద్దఎత్తున్న నినాదాలు చేస్తున్నారు.
More Stories
రైల్వే ప్రమాదానికి కారణం, బాధ్యులను గుర్తించాం
మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
ఆసక్తి కలిగిస్తున్న అమిత్ షాతో చంద్రబాబు భేటీ