డబుల్ బెడ్ రూం అంశంపైనే జిఎచ్ఎంసి ఎన్నికలు

డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే బీజేపీకి అంత ఎక్కువ లాభమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇళ్ళు వచ్చిన వారి కంటే రాని వారికే ఎక్కువ కడుపు మంటగా ఉంటుందని అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. 

డబుల్ బెడ్ రూం ఇళ్ళ అంశం ప్రాతిపదికనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయని చెప్పుకొచ్చారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళు, కరోనా, హైదరాబాద్ వరదలు.. అన్నిటిల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైన్నట్లు కిషన్ రెడ్డి విమర్శించారు. 

దుబ్బాకలో బీజేపీ గెలుస్తోందనటానికి మంత్రి హరీష్ రావు అసహనమే వెల్లడి చేస్తున్నట్లు చెప్పారు. దుబ్బాకలో నిరుద్యోగులు బీజేపీకి ప్రచారం చేయటాన్ని హరీష్ రావు తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారీ. 

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీచేసే అంశంపై పార్టీలో చర్చ జరగలేదని కి రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాకలో పవన్ కల్యాణ్ ప్రచారం‌ చేసే విషయంలో స్పష్టత లేదని చెప్పారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలవ్వాలని ముఖ్యమంత్రే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి అడుగుతున్నారని కిషన్ రెడ్డి  ఆరోపించారు. విరాళాలు ఇవ్వాలని సినీ నటులను మంత్రి తలసాని‌ అడిగనందునే నాయకులు కూడా విరాళాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ అన్నారని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రనికి త్వరలో  విపత్తు నిధులొస్తాయని కిషన్ రెడ్డి చెప్పారు.