
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. మహారాష్ట్ర సర్కారుపై ఢీ అంటే ఢీ అంటూ ఇటీవల వార్తల్లో పెను సంచలనంగా మారిన కంగనా రనౌత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ట్వీట్లు చేస్తోంది.
అయితే ఆమె చేస్తున్న ట్వీట్లతో పాటు ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ మున్నావరలీ సయ్యద్ ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. హిందూ, ముస్లిం ఆర్టిస్టుల మధ్య సామాజిక విభజన తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు.
అంతేకాకుండా ముంబై పోలీసులను బాబర్స్ అంటూ కంగన పోల్చడం పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది.
పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన బాంద్రా కోర్టు సీఆర్పీసీ సెక్షన్ 156 (3) కింద ఆమెపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపాలని ముంబై పోలీసులకు మెజిస్ట్రేట్ జయదేవ్ గులే ఆదేశాలు జారీచేశారు.
కోర్టు ఆదేశంతో ముంబై పోలీసులు కంగనపై దేశ ద్రోహం కేసు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. . ఇలాఉండగా, రైతులను అవమానించారన్న ఆరోపణలపై నాలుగు రోజుల క్రితం కర్ణాటకలోని తుమ్కూర్‌లోని క్యతాసంద్ర పోలీస్ స్టేషన్లో కంగనాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వ్యవసాయానికి సంబంధించిన బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులను ఉగ్రవాదులంటూ కంగనా అవమానించారని న్యాయవాది ఎల్ రమేశ్ నాయక్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
More Stories
జార్ఖండ్లో 8 మంది మావోయిస్టులు మృతి
అమర్నాథ్ యాత్రకు 533 బ్యాంకుల్లో రిజిస్ట్రేషన్లు!
దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి డి విటమిన్ లోపం