
హర్యానాలోని బరోడా అసెంబ్లీ నియోజక వర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఒలింపిక్ పతాక విజేత యోగేశ్వర్ దత్తాను తమ అభ్యర్థిగా బిజెపి ప్రకటించింది. సోనిపట్‌లో బరోడా స్థానానికి వచ్చే నెల 3న జరగనున్న ఈ ఎన్నికల్లో రాజకీయ నేతగా మారిన మల్లయోధుడు యోగేశ్వర్ పోటీ చేయనున్నారని పార్టీ ప్రకటన విడుదల చేసింది.
శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ కావడంతో ఈ ప్రకటన చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ కృష్ణ హుడా చనిపోవడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుడా చేతిలో యోగేశ్వర్ ఓటమి చెందారు. ఇప్పుడు ఇదే స్థానం నుండి తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటి వరకు ఈ స్థానంలో బిజెపి ఒక్కసారి కూడా గెలవలేదు. అంతకముందు బిజెపి నేత బబితా పోగట్‌తో పాటు సాక్షి మాలిక్, గీతా పొగట్‌తో వంటి ప్రముఖ క్రీడాకారులు..ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్‌ను కలిశారు. యోగేశ్వర్‌ను అభ్యర్థిగా పోటీ చేయించేందుకు ఈ క్రీడాకరులంతా ముఖ్యమంత్రిని కలిశారని సమాచారం.
అంతకమందు రాష్ట్ర పార్టీ విభాగం 25 పేర్లను పరిశీలించిందని, నలుగురు పేర్లను ఫైనల్ చేసి..అధిష్టానానికి పంపినట్లు ఖట్టర్ తెలిపారు. అంతలోనే యోగేశ్వర్ పేరును బిజెపి ప్రకటించింది.
More Stories
రాజద్రోహం సెక్షన్ కొనసాగాల్సిందే.. శిక్ష కూడా పెరగాలి
ఉన్నత స్థితికి భారత్ నేపాల్ సంబంధాలు
మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు, డిజిపిపై వేటు