జమ్మూ-కశ్మీరులో ప్రతి బుధవారం మెగా బ్లాక్ దివస్  

 
జమ్మూ-కశ్మీరులో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి బుధవారం మెగా బ్లాక్ దివస్ నిర్వహిస్తామని లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం చెప్పారు. కశ్మీరులో 30 చోట్ల, జమ్మూలో 42 చోట్ల వీటిని నిర్వహిస్తామని తెలిల్పారు. 
ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన 285 బ్లాక్ దివస్ కార్యక్రమాల్లో సుమారు నాలుగున్నర లక్షల మంది పాల్గొన్నారని పేర్కొన్నారు.
బ్యాక్ టు విలేజ్ కార్యక్రమంలో అసంపూర్తిగా మిగిలిన 13,675 ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు తెలిపారు. కొత్తగా 5,980 పనులను చేపట్టినట్లు తెలిపారు.  చాలా కాలం నుంచి పూర్తి కాకుండా మిగిలిపోయిన 44 ప్రాజెక్టులను సెప్టెంబరులో పూర్తి చేసినట్లు చెప్పారు. మరొక 1,798 ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నట్లు తెలిపారు.
నాలుగు లక్షలకు పైగా డొమిసిల్ సర్టిఫికేట్లను జారీ చేశామని వెల్లడించాయిరు. 4,440 స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. 2019లో ప్రకటించిన 10 నూతన పారిశ్రామిక వాడల్లో 5 వాడలు త్వరలో పూర్తి కాబోతున్నట్లు తెలిపారు. మిగిలినవి వచ్చే ఏడాది డిసెంబరునాటికి పూర్తవుతాయని చెప్పారు.