రూ.1,23,474 కోట్ల  పన్నులు రిఫండ్ 

క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్నా ట్యాక్స్ పేయ‌ర్ల‌ను ఇబ్బంది పెట్ట‌కుండా సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ప‌న్ను తిరిగి చెల్లింపు సేవ‌లు అందిస్తున్న‌ది. ప్ర‌తి సంవ‌త్స‌రం లాగానే ఈసారి కూడా ట్యాక్స్ పేయ‌ర్స్‌కు ఇవ్వాల్సిన‌ నిధుల‌ను రీఫండ్ చేస్తున్న‌ది.

అందులో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 13వ తేదీ వ‌ర‌కు మొత్తం రూ.1,23,474 కోట్ల నిధుల‌ను సీబీడీటీ రీఫండ్ చేసింది. ఈ విష‌యాన్ని బుధ‌వారం ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ వెల్ల‌డించింది.

సీబీడీటీ మొత్తం 38.11 ల‌క్ష‌ల మంది ట్యాక్స్ పేయ‌ర్‌ల‌కు ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్స్ చేసింద‌ని ఐటీ డిపార్టుమెంట్ తెలిపింది. అందులో రూ.33,442 కోట్లు ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్స్ ఉన్నాయ‌ని, 36,21,317 మంది ట్యాక్స్ పేయ‌ర్ల‌కు ఈ చెల్లింపులు చేశార‌ని పేర్కొన్న‌ది.

ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ఇప్ప‌టివ‌ర‌కు రూ.90,032 కోట్ల కార్పొరేట్ ట్యాక్స్‌ను రీఫండ్ చేశార‌ని, మొత్తం 1.89 ల‌క్ష‌ల‌ కేసుల‌లో ఈ చెల్లింపులు జ‌రిగాయ‌ని ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ వెల్ల‌డించింది.