22న బీహార్ ప్రచార సభల్లో ప్రధాని మోదీ 

బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఈ నెల 22న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తున్నది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అభ్యర్థులకు మద్దతుగా ప్ర‌ధాని తొలి ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. 

బ‌క్స‌ర్‌, జెహానాబాద్‌, రోహ్తాస్‌, భాగ‌ల్పూర్‌లో ఎన్డీయే అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌ధాని ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన‌నున్న‌ట్లు బీజేపీ వ‌ర్గాలు తెలిపాయి. పీఎంవో నుంచి అనుమ‌తి వ‌చ్చిన వెంట‌నే ర్యాలీ, స‌భా ఏర్పాట్లు, పాల్గొనే నాయ‌కుల‌కు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు ఆ పార్టీ నాయ‌కులు పేర్కొన్నారు. 

పార్టీకి అతిపెద్ద స్టార్ క్యాంపెయిన‌ర్ ప్ర‌ధాని మోదీనే అని బీజేపీ భావిస్తుంది. దీన్ని ఓట్లుగా మ‌లుచుకునేందుకు ఆశ‌గా ఎదురు చూస్తోంది. 

243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి మూడు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 28, న‌వంబ‌ర్ 3, న‌వంబ‌ర్ 7న మూడు ద‌శ‌ల్లో పోలింగ్‌ను నిర్వ‌హించి న‌వంబ‌ర్ 10న ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.