భారత్ తో ముఖాముఖి తలపడే దమ్ము, సత్తా లేని పాకిస్థాన్ వెన్నుపోటు పొడవడానికి ఏ అవకాశాన్నీ వదలడం లేదు. మన దేశంలో అలజడి సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చివరికి జైళ్లలో మగ్గుతున్న చిల్లర ముఠాలను తన కుట్రల్లో భాగస్వాములను చేయడానికి మంతనాలు సాగిస్తోంది.
భారత దేశ భద్రతా సంస్థలు ఇచ్చిన నివేదిక ప్రకారం, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) భారత దేశంలోని పంజాబ్‌లో అరాచకం సృష్టించేందుకు కుట్ర పన్నింది. పంజాబ్‌లోని హిందూ సంస్థల నాయకులను హత్య చేయించాలని, తద్వారా రాష్ట్రంలో అనిశ్చితి సృష్టించాలని ప్రయత్నిస్తోంది.
ఈ వివరాలను ఓ భద్రతా సంస్థకు చెందిన అధికారి వెల్లడిస్తూ ఈ కుట్రను అమలు చేయడం కోసం పంజాబ్‌లోని జైళ్ళలో ఉన్న గ్యాంగ్‌స్టర్స్, క్రిమినల్స్‌ను ఐఎస్ఐ సంప్రదించినట్లు తెలిపారు. కొద్ది రోజుల నుంచి ఐఎస్ఐ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని తెలిపారు.
పంజాబ్‌లోని ఐఎస్ఐ హ్యాండ్లర్స్ ద్వారా జైళ్లలో ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను, ముగ్గురు క్రిమినల్స్‌ను సంప్రదించినట్లు పేర్కొన్నారు. హిందూ సంస్థల నేతలను హత్య చేసే పనిని వీరికి అప్పగించినట్లు తెలిపారు. ఖలిస్థాన్ ఉగ్రవాదుల ద్వారా పంజాబ్‌లోకి ఆయుధాలను ఐఎస్ఐ పంపిస్తోందన్నారు. ఆయుధాల అక్రమ రవాణా కోసం డ్రోన్లను వినియోగిస్తోందని పేర్కొన్నారు.
More Stories
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో అండర్‌వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు