తెలంగాణ అసెంబ్లీలో స్టాంపుల రిజిస్ట్రేషన్ చట్టాలకు సంబంధించిన బిల్లు, వ్యవసాయ భూమి సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు, క్రిమినల్ ప్రొసీజర్ సవరణ బిల్లును మంత్రులు ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందారు.
జిహెచ్ఎంసి చట్ట సవరణ బిల్లును మంత్రి కెటి రామారావు అసెంబ్లీలో ప్రవేశపెడుతూ 150 డివిజన్లలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని 2015లోనే నిర్ణయించామని చెప్పారు. దానికి ఇప్పుడు చట్టసవరణ చేస్తున్నామని చెబుతూ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
బిసిల రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయి. జిహెచ్ఎంసి పరిధిలో పది శాతం గ్రీన్ బడ్జెట్ కు కూడా సభ ఆమోదం తెలిపింది. గ్రేటర్ పరిధిలో మొక్కలను పరిరక్షించాలని చెబుతూ ఆ బాధ్యతలు ప్రజాప్రతినిధులు, అధికారులకే కేటాయించామని పేర్కొన్నారు.

More Stories
ప్రజలపై కాంగ్రెస్ అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!