ఆర్ధిక శాస్త్రంలో ఇద్దరికీ నోబెల్   

ఆర్థిక‌శాస్త్రంలో ఈ యేటి నోబెల్ బ‌హుమ‌తిని ఇద్ద‌రు గెలుచుకున్నారు.  వేలం విధానంలో మార్పుల‌ను, నూత‌న వేలం విధానాల‌ను రూపొందించిన పౌల్ ఆర్ మిల్‌గ్రామ్‌, రాబ‌ర్ట్ బీ విల్స‌న్‌ల‌కు ఎక‌నామిక్స్‌లో నోబెల్ పుర‌స్కారం ద‌క్కింది.  స్టాక్‌హోమ్‌లో ఇవాళ నోబెల్ క‌మిటీ ఈ అవార్డు విజేత‌ను ప్ర‌క‌టించింది.

వేలం వేయ‌డం అనేది ప్ర‌తి చోట ఉంటుంద‌ని, అది మ‌న రోజువారి జీవితాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని నోబెల్ క‌మిటీ వెల్ల‌డించింది.  పౌల్ మిల్‌గ్రామ్‌, రాబ‌ర్ట్ విల్స‌న్‌లు క‌నుగొన్న కొత్త వేలం విధానాల‌ వ‌ల్ల అమ్మ‌కందారుల‌కు, కొనుగోలుదారుల‌కు, ప‌న్నుదారుల‌కు లాభం చేకూరినట్లు నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. రేష‌న‌ల్ బిడ్డ‌ర్ల గురించి విల్స‌న్‌,  బిడ్డింగ్‌లో పాల్గొన్న‌వారిలో ఉండే వ్య‌త్యాసాల గురించి పాల్ మిల్‌గ్రామ్ కొత్త ఫార్మాట్ల‌ను త‌యారు చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా అమ్మకపుదారులకు, వినియోగదారులకు, టాక్స్ పేయర్స్‌కు లబ్ది చేకూర్చేలా వేలం సిద్దంతాన్ని సరళీకరించడమే కాకుండా, కొత్త వేలం విధానాలను ఆవిష్కరించిన పాల్ ఆర్ మిల్‌గ్రామ్‌, రాబర్ట్ బి విల్సన్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందజేస్తున్నామని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ గోరన్ హాన్సన్ ప్రకటించారు.

రాబర్ట్ విల్సన్.. కామన్ వాల్యూతో వస్తువులను వేలం విధానాన్ని అభివృద్ది చేశారు. మరోవైపు పాల్ మిల్‌గ్రామ్‌, వేలం సిద్ధాంతాన్ని మరింత సరళీకరించారు. కేవలం కామన్ వాల్యూ మాత్రమే కాకుండా ఒక బిడ్డర్ నుంచి మరో బిడ్డర్ మారేలా ప్రైవేటు వాల్య్సూను అనుమతించారు.

గ‌త ఏడాది ఆర్థిక‌శాస్త్రంలో ఈస్త‌ర్ డుఫ్లో, అభిజిత్ బెన‌ర్జీ దంప‌తులు నోబెల్ బ‌హుమ‌తి గెలుచుకున్న విష‌యం తెలిసిందే. నోబెల్ గెలుచుకున్న అయిద‌వ జంట‌గా వారు రికార్డుల్లో నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు 10 మిలియన్ క్రోనా (1.1 మిలియన్ డాలర్లు) నగదు బహుమతి, బంగారు పతకం లభిస్తుంది.