లాక్‌డౌన్‌తో కరోనా మహమ్మారికి చెక్ పెట్టచ్చని అనుకుంటే పొరపాటు అని, ఇకపై వీటికి స్వస్తి పలకాలని ప్రపంచ నేతలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) విజ్ఞప్తి చేసింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను ఒక సాధనంగా ఉపయోగపడుతుందని తొలుత తీసుకున్న వైఖరిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు సవరించుకున్నట్టుగా కనిపిస్తోంది.
కోవిడ్19పై పోరులో డబ్ల్యుహెచ్‌ఓ డైరక్టర్ జనరల్‌కు ప్రత్యేక దూతగా వ్యవహరిస్తున్న డేవిడ్ నబరో ప్రపంచ నేతలకు ఒక విజ్ఞప్తి చేస్తూ, కరోనాను ప్రాథమికంగా నియంత్రించే పద్ధతి కింద లాక్‌డౌన్‌ను ఉపయోగించడం ఆపాలని కోరారు. లాక్‌డౌన్ల వల్ల సాధించినదేమైనా ఉందంటే అది పేదరికమేనని పేర్కొన్నారు.
అయితే లాక్‌డౌన్ వల్ల ఎంత మంది ప్రాణాలు కాపాడబడినదీ లేనిదీ ఆయన ప్రస్తావించలేదు. అనేక చర్యల్లో లాక్‌డౌన్ కూడా ఒకటి. అలా అని దానిని తక్కువ చేసి చూడలేము. దీని వల్ల పేదలు మరింత పేదలుగా మారారని ఆయన చెప్పారు.
‘లాక్‌డౌన్‌ను కరోనా వైరస్ అదుపునకు ప్రాథమిక మార్గంగా ప్రపంచ ఆరోగ్య సంస్థలో భాగమైన మేము సూచించము’ అని నబరో చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు శక్తినంతటినీ కూడదీసుకునేందుకు, వనరులను సర్దుబాటు చేసుకునేందుకు, ఆరోగ్య కార్యకర్తలకు తగు రక్షణ కల్పించేందుకు కొంత వ్యవధి అవసరమవుతుందని తెలిపారు.
ఆ వ్యవధిని తీసుకోవడానికి కొద్ది కాలం పాటు లాక్‌డౌన్ విదించడాన్ని తాము సమర్థిస్తాం. కానీ, ఆ పేరుతో లాక్‌డౌన్‌ను పొడిగించుకుంటూ పోవడం సరికాదని డబ్లుహెచ్‌ఓ ప్రత్యేక దూత హెచ్చరించారు. ఈ లాక్‌డౌన్ల వల్ల కరీబియన్ లేదా పసిఫిక్ దీవుల్లో పర్యాటక పరిశ్రమ ఎలా దెబ్బతినిపోయిందో చూడండని పేర్కొన్నారు.
పర్యాటకమే కాదు, ప్రపంచ వ్యాపితంగా చిన్న, సన్నకారు రైతుల జీవితాలను కూడా ఇది ఛిద్రం చేసిందని పేర్కొన్నారు.ఈ కాలంలో పేదరికం విపరీతంగా పెరిగిపోయిందని, వచ్చే ఏడాది నాటికి ప్రపంచ వ్యాపితంగా పేదరికం రెట్టింపు స్థాయికి చేరుకునే అవకాశముందని డాక్టర్ నబరో ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పిల్లల్లో పౌష్టికాహార లేమి కూడా రెట్టింపయ్యే స్థితి వస్తుందని ఆయన తెలిపారు.
ప్రపంచంలో విధించిన లాక్‌డౌన్లలో కెలా అత్యంత కఠినమైనది, దీర్ఘకాలికమైనది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లాక్‌డౌనేనని డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది. స్పెయిన్ మార్చిలో విధించిన లాక్‌డౌన్ లో ప్రజలను ఇళ్ల నుంచి బటయకు రావడానికి కూడా వీల్లేకుండా ఆంక్షలు విధించారు. ఇదే విధమైస కఠిన ఆంక్షలను అనేక దేశాలు చేపట్టాయి. ఈ చర్యల్లో చాలా వరకు అనవసరమైనవని డబ్ల్యుహెచ్‌ఓ భావిస్తున్నది.
More Stories
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
బంగ్లాదేశ్ లో నమాజ్ సమయంలో దుర్గాపూజపై ఆంక్షలు
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ జయకేతనం