వ్యవసాయ చట్టాలపై గ్రామాలలో బిజెపి ప్రచారం 

ప్రధానమంత్రి  నరేంద్రమోదీ  రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకు వచ్చినటువంటి వ్యవసాయ చట్టాలపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  గ్రామాలలో రైతులకు  వ్యవసాయ  బిల్లులపై  అవగాహన  కల్పించడానికి బిజెపి నాయకులు విస్తృతంగా పర్యటనలు చేపట్టారు. 
 
కరీంనగర్ జిల్లా నంగునూరు గ్రామంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్  ప్రచార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వరంగల్లులో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హుజురాబాద్ లో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు  కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 
బిల్లుల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రైతులు ప్రతి చోటా ప్రధానిని అభినందిస్తున్నారు. తమ అభివృద్ధికి దోహదపడుతున్న చర్యలను ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులు ప్రధానికి  లేఖల ద్వారా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రైతులకు జరిగే ప్రయోజనాలను వివరిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా వ్యవసాయ పంటలు అమ్ముకోవడానికి అదే విధంగా ఈ వర్షాకాలం పంటను కూడా రైతులు లాభసాటిగా అమ్ముకునే వీలు కలుగుతుంది. దేశంలో ఏ ప్రాంతంలోనైనా అమ్ముకోవడానికి అవకాశం కల్పించిన ఈ బిల్లులు రైతులకు అధికంగా లాభం జరుగుతుంది తప్ప నష్టం జరగదని స్పష్టం చేస్తున్నారు. 
 
తెలంగాణలో రైతులకు లాభం జరుగుతున్న ఈ బిల్లుల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ, తప్పుడు ప్రచారం చేయడం తెలంగాణ రైతాంగాన్ని నష్టాలకు గురి చేయడమే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కనీస మద్దతు ధర (ఎం ఎస్ పీ) కే కొనుగోలు చేయడం అంటే పరోక్షంగా రైతులకు నష్టం చేయడమే అని బిజెపి నేతలు ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.
 
సన్న బియ్యం దొడ్డు బియ్యం అన్నిటికీ ఒకే రకమైన కనీస మద్దతు ధర  కాకుండా అదనంగా సన్న బియ్యానికి రూ  500  బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి డిమాండ్ చేసింది.  మొక్కజొన్నలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనని కూడా కోరింది. 
 
పాత మొక్కజొన్నలను పౌల్ట్రీ ఫామ్ యాజమాన్యం కొనుగోలు చేయమని మాట్లాడడం వల్ల రైతాంగానికి ఏ విధంగా మేలు జరుగుతుందని బిజెపి ప్రశ్నించింది. మొక్క జొన్నలను దిగుమతి చేసుకోకూడదని కేసీఆర్ మాట్లాడడం ఏ విధంగా పౌల్ట్రీ పరిశ్రమ లాభాల్లో ఉంటుందో సమాధానం చెప్పాలని బీజేపీ నేతలు నిలదీశారు.