అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ముస్లింల కోసమే

సోమ, మంగళ వారాలలో కేసీఆర్ జరుపుతున్న రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కేవలం ముస్లింల బుజ్జగింపు కోసమే అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. 
 
కరోనాతో 20 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంది కరోనా నుండి కోలుకొని నేరుగా ఢిల్లీ నుండి తెలంగాణ బయలుదేరిన బండి సంజయ్ హైదరాబాద్ నుండి బయలుదేరి కొండగట్టు ఆంజనేయస్వామి నల్లగొండ నరసింహ స్వామిని వేములవాడ రాజన్నలను దర్శించుకున్నారు.
 
భాగ్యనగరంలో పేద బీసీలకు అన్యాయం చేసి క్రికెట్ టీంలను కన్నవారికి బీసీ రిజర్వేషన్లు అందించడానికె ఈ ప్రత్యేక సమావేశాలు జరుపుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల రక్షణ కోసం త్రిబుల్ తలక్ పై చట్టం చేస్తే మాట్లాడని సీఎం కేసీఆర్ ఈ సమావేశాలు జరపడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. 
 
ఇప్పుడు మాత్రంవారి ఓట్ల కోసం , వాళ్ళను ఎక్కువ మందిని బీసీ కేటగిరీలో చేర్చి, జీహెచ్ ఎంసీలో పోటీ చేయించడానికి ప్రత్యేక చట్టం చేయాలి కాబట్టి ఈ అత్యవసర అసెంబ్లీ సమావేశాలు జరపడం సిగ్గుచేటని విమర్శించారు. 
 
రాష్ట్రంలో విలాయతాండవం చేస్తున్న సమస్యలు సీఎం కేసీఆర్ కు పట్టవు కానీ ఓట్లు, సీట్లు  మాత్రం కావాలని దుయ్యబట్టారు.  ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు అమలు చేయడని, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడని  కానీ బిసిల రిజర్వేషన్లను కలరాస్తూ అందులో ముస్లింలకు అవకాశం కల్పించడానికి ఈ ప్రత్యేక సమావేశాలు జరుపుతున్నది సంజయ్ మండిపడ్డారు.  
 
కరీంనగర్ లో హిందువులు బొందుగాళ్ళు అంటే హిందువులు  అంత ఒకటై ఎలా బుద్ది చెప్పారో హైదరాబాద్ లో కూడా అలాగే హిందువులు అంతా ఏకమై గుణపాఠం చెబుతారని సంజయ్ హెచ్చరించారు. గత ఎన్నికలలో బీసీలకు చెందాల్సిన 22 కార్పొరేషన్ సీట్లను మైనారిటీలకు ఇచ్చారని గుర్తు చేశారు. 
 
ఇప్పుడు వాటిని రెండింతలు చేయడానికి ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టారని అంటూ కేసీఆర్ కుటిల రాజకీయ బుద్దిని, ఓటు బ్యాంకు రాజకీయాన్ని ప్రజల ముందు ఎండగడతామని స్పష్టం చేశారు.