
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్న భారత్ రానున్న 30 ఏండ్లలో రెండు స్థానాలు ఎగబాకుతుందని ప్రముఖ మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ అంచనా వేసింది. 2050 నాటికి ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తుందని పేర్కొన్నది.
2017 నాటికి భారత్ ప్రపంచంలో ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఆ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకున్న లాన్సెట్.. 2100 సంవత్సరంలో కూడా భారత్ మూడో స్థానంలోనే కొనసాగుతుందని తెలిపింది.
వివిధ దేశాల్లోని శ్రామిక జనాభా వల్ల ఆయా దేశాల జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో వచ్చే మార్పులను బేరీజువేసి లాన్సెట్ ఈ అంచనా వేసింది. మున్ముందు చైనాతోపాటు భారత్‌లో శ్రామిక జనాభా సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, అయినప్పటికీ శ్రామిక జనసంఖ్య పరంగా భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
‘2100 సంవత్సరం నాటికి కూడా శ్రామిక జనులు భారత్‌లోనే అత్యధికంగా ఉంటారు. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా, చైనా, అమెరికా నిలుస్తాయి’ అని లాన్సెట్ పేర్కొన్నది.
More Stories
మే రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు
లిక్కర్ స్కాంలో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి
దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి