జమ్మూకశ్మీరులో పాక్ గూఢచారి అరెస్ట్

పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న ఓ వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూకశ్మీరులోని సాంబ జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాల ఫోటోలను కుల్జీత్ అనే వ్యక్తి తీసి పాకిస్థాన్ దేశానికి పంపిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
 
 2018వ సంవత్సరం నుంచి కుల్జీత్ జమ్మూకశ్మీరులోని కీలకప్రాంతాల ఫొటోలు తీసి పంపిస్తున్నాడని వెల్లడైంది. దీనికిగాను పాక్ కుల్జీత్ కు అధిక డబ్బు చెల్లించిందని పోలీసులు చెప్పారు. పాక్ గూఢచారి కుల్జీత్ నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, కీలక ప్రాంతాల ఫొటోలు, పలు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
 నిందితుడు కుల్జీత్ ను కోర్టులో ప్రవేశపెట్టగా అతన్ని రిమాండుకు తరలిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. సరిహద్దుల్లో కీలకప్రాంతాల ఫొటోలను గూఢచారి పాక్ కు పంపించాడని వెల్లడైంది.పాక్ గూఢచారి కుల్జీత్ పై ఆర్డినెన్స్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశామని సాంబ సీనియర్ ఎస్పీ రాజేశ్ శర్మ చెప్పారు.