ఫోర్బ్ జాబితాలో భారతీయ సంపన్నుల్లో వరుసగా 13వ సారి ముకేశ్ అంబానీ అగ్రస్థానం సొంతం చేసుకున్నారు. ఫోర్బ్ 2020లో టాప్ 100 ధనిక భారతీయుల జాబితా గురువారం విడుదలైంది. ఈ జాబితా లో చాలా కొత్త పేర్లు కూడా చేరాయి. టాప్ 100 సంపన్నుల మొత్తం ఆస్తుల విలువ 517.5 బిలియన్ డాలర్లు ఉండగా, గతేడాదిలో ఉన్నవారి సంపదతో పోలిస్తే ఇది 14 శాతం పెరిగింది.
మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ 88.7 బిలియన్ డాలర్లు ఉంది. 25.2 బిలియన్ డాలర్ల నికర విలువతో గౌతమ్ అదానీ ఫోర్బ్ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో శివ్ నాడార్, ఆయన ఆస్తులు 20.4 బిలియన్ డాలర్లు. అలాగే నాలుగో స్థానంలో ఉన్న డిమార్ట్ యజమాని రాధాకిషన్ దమాని ఆస్తుల విలువ 4 15.4 బిలియన్లు, ఐదవ స్థానంలో ఉన్న హిందూజా బ్రదర్స్ ఆస్తులు 8 12.8 బిలియన్ డాలర్లు ఉన్నాయి.
ఇక 11.5 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఆరో స్థానంలో సైరస్ పూనవాలా ఉన్నారు. 11.4 బిలియన్ డాలర్ల ఆస్తులతో పల్లోంజి మిస్త్రీ ఏడో స్థానం, 11.3 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఎనిమిదవ స్థానంలో ఉదయ్ కోటక్, తొమ్మిదవ స్థానంలో గోద్రేజ్ ఫ్యామిలీ (11 బిలియన్ డాలర్లు) ఉంది. 10.3 బిలియన్ డాలర్ల ఆస్తులతో లక్ష్మి మిట్టల్ పదో స్థానం సొంతం చేసుకున్నారు.
ఫోర్బ్ 100 మంది భారత సంపన్నుల కొత్త జాబితాలో మహిళలు ఉన్నారు. వీరిలో అత్యధిక నికర విలువ కలిగిన కిరణ్ మజుందార్- షా ఈ ఏడాది జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. అయినప్పటికీ దేశంలోని ధనిక ప్రజల సంపద పెరిగింది. 2019తో పోలిస్తే భారతదేశ సంపన్న మహిళల జాబితాలో పెద్దగా మార్పులేదు.
కాగా, ఫోర్బ్స్ భారత్ టాప్ 100 లిస్టులో నలుగురు తెలుగోళ్లకు చోటు దక్కింది. దివిస్ లేబొరేటరీస్ ఓనర్ మురళీ దివి దేశంలోని సంపన్నుల జాబితాలో 20వ ర్యాంకు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల పరంగా చూస్తే ఆయనే నంబర్ వన్ సంపన్నుడిగా నిలిచారు. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఫ్యామిలీ (జాయింట్గా) 43వ ర్యాంకు దక్కించుకుంది. మేఘా సంస్థ యజమాని పీపీ రెడ్డి కుటుంబం 45వ స్థానంలో నిలిచింది. అరబిందో ఫార్మా కో ఫౌండర్ పీవీ రాంప్రసాద్రెడ్డి 49వ స్థానాన్ని సంపాదించారు.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి