
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలితకు ఆత్మీయురాలైన వీకే శశికళకు చెందిన ఆస్తులను ఆదాయపన్ను శాఖ స్థంభింపజేసింది. బినామీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద శశికళకు చెందిన రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తులను బుధవారం ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. ఈ ఆస్తుల్లో రూ.300 కోట్ల విలువైన రెండు ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.
సిరుత్తవూర్, కోడనాడులో ఉన్న ఆ ఆస్తులు జయలలితకు ఆప్తులైన శశికళ, ఇళవరసి, సుధాకరన్ పేర్లపై ఉన్నాయని సమాచారం. ఆయా ఆస్తుల దగ్గర ఐటీ శాఖ నోటీసులను అతికించింది.
‘మాజీ సీఎం జయలలితకు సన్నిహితురాలైన శశికళలకు చెందిన కోడనాడ్, సిరుత్తవూర్‌లోని ఆస్తులను ఆదాయ పన్నుల శాఖ జప్తు చేసింది. స్థంభింపజేసిన ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లు’ అని ఆదాయ పన్ను శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
More Stories
భారత్ – ఫ్రాన్స్ 26 రఫేల్ మెరైన్ జెట్ల కోసం ఒప్పందం
పాక్ గగనతలాన్ని మూసేయడంతో డీజీసీఏ సూచనలు
ట్రంప్ టారిఫ్లను నిలిపివేయాలని కోర్టుకు 12 రాష్ట్రాలు