కె. వెంకటకృష్ణారావు,
రీసెర్చ్ స్కాలర్, ఐఐటీ, వారణాసి
రెండు ప్రపంచ యుద్ధాలతో అతులాకుతలమైన పశ్చమ దేశాలు, మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా ప్రపంచంలో శాంతి భద్రతల బాధ్యతను వివిధ దేశాలు కలిసి పనిచేసుకునేందుకు ప్రపంచ దేశాలు అన్ని కలిసి ఐక్యరాజ్య సమతిని ఏర్పాటు చేసుకున్నాయి. ఐక్యరాజ్య సమతిలో జనరల్ అసెంబ్లీ, సచివాలయం, ప్రపంచ కోర్టు, భద్రతా మండలి, ఆర్థిక- సామజిక మండలి వంటి ఐదు విభాగాలు ఉన్నాయి. అందులో భద్రతా మండలి చాలా శక్తివంతమైనది.
భద్రతా మండలి లో 15 దేశాలు సభ్యులుగా ఉంటారు. అందులో రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచిన యూస్ఏ, యూకే, రష్యా , ఫ్రాన్స్, చైనా దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉంటాయి. మిగతా 10 దేశాలు తాత్కాలిక సభ్యత్వం కలిగి ప్రతి రెండేళ్లకు మారుతూ ఉంటాయి.
ప్రస్తుతం భారత్ భద్రతా మండలిలో తాత్కాలిక సబ్యత్వం తో ఉన్నది. శాశ్వత సభ్యత్వం కలిగిన ఐదు దేశాలుకు వీటో అధికారం ఉంటుంది. దానిని అడ్డుపెట్టుకొని సభ్య దేశాలు తమ అవసరాలకు అనుగుణంగా వీటో అధికారాన్ని వాడుకుంటున్నారు తప్పితే ప్రపంచ శ్రేయస్సు కోసం పని చేస్తున్న దాఖలాలు లేవు .
75 సంవత్సరాలు క్రితం ఐక్య రాజ్య సమితిని అప్పటి పరిసత్థులుకు అనుకూలంగా మార్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సమితి లో విప్లవాత్మక మార్పులని తీసుకురాలేకపోయారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుని ఒకసారి గమనిస్తే 3 దేశాలు(ఫ్రాన్స్ , యూకే, రష్యా) ఒక్క ఐరోపా ఖండం లోనే ఉన్నాయు.
అలాగే 21 వ శతాబ్దంలో బాగా రాణిస్తున్న, ప్రపంచ జనాభాలో 2/3 వ శాతం ఉన్న ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలు నుండి ఒక్క చైనా తప్ప ఇంకో దేశం లేదు. ఆర్దికంగా వెనకపడి, రాజికీయంగా సతమతమవుతున్న ఆఫ్రికా ఖండం లోని 54 దేశాలలో నుండి ఒక్క దేశం కూడా భద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం కలిగిలేదు. దీని వల్లన ఆయా దేశాలు తమ గొంతును వినిపించలేకపోతున్నారు.
లాటిన్ అమెరికా ఖండం కూడ ఇదే రకమైన పరిస్థితి ఉంది. లాటిన్ అమెరికా లో ఉన్న 18 దేశాలలో ఒక్కటి కూడా శాశ్వత సబ్యత్వం కలిగి లేదు. ఆసియా ఖండంలో చైనా తప్ప ఇంకో దేశం భద్రత మండలిలో శాశ్వత సబ్యత్వం కలిగి లేదు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఆసియా ఖండం లోనే నివసిస్తూ ఉన్నారు. ఆసియాలో చాలా దేశాలు చైనా ఆధిపత్య ధోరణితో సతమత మవుతూ ప్రపంచ దేశాల సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి .
భద్రతా మండలి లో శాశ్విత సభ్యత్వం కోసం g4 దేశాలు భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్ ప్రయత్నిస్తున్నాయి. భద్రతా మండలి లోని చాలా శాశ్వత సభ్య దేశాలు, ప్రపంచ దేశాలు గత 10 సంవత్సరాలు నుండి భారత దేశానికి శాశ్వత సభ్యత్వంకి మద్దుతు ఇస్తున్నప్పటికీ వాళ్ళకి ఎంత వరకు చిత్త శుద్ధి ఉందొ అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ సభ్య దేశాలు విప్లవాత్మక మార్పులు కోసం తగు చర్యలు తీసుకోవడంలో నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తూ వస్తున్నాయి.
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన ఐదు దేశాల్లో నాలుగు దేశాలు అనగా అమెరికా, రష్యా, ఫ్రాన్స్ , యూకే దేశాలు ద్వైపాక్షిక చర్చల్లో బాగంగా భారత్ కి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దుతు పలికాయి. కానీ పక్కన ఉన్న చైనా మాత్రం భారత్ మీద అక్కసు వెళ్లగక్కుతుంది, చైనా అక్కసుని పక్కన పెట్టి భారత్ కు మద్దతు ఇచ్చి ప్రపంచ అభివృద్ధి కోసం భారత్ తో కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భారత దేశం ఎప్పుడు కూడ ప్రపంచానికి ఏ విధంగా సహాయపడదామా అనే ఆలోచన ధోరణి తో ఉంటుంది. అందులో భాగంగానే కరోనా వ్యాప్తి కట్టడికి అవసరమైన వాక్సిన్ సరఫరాకు ప్రపంచ దేశాల అవసరాలకు పంపిణి చేసేందుకు భారత్ సహాయం చేస్తుందని ప్రధాని మోదీ గత వారంలో ఐక్యరాజ్య సమతి సర్వసభ్య సమావేశం వేదికగా పునరుద్గాటించారు.
ప్రపంచంలో 1/5 వ వంతు జనాభా, అతి పెద్ద ప్రజాస్వామ్యం, 5 వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది, రాబోయే కొద్దీ సంవత్సరాలలో ౩ వ పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతుంది. ఒక విధంగా చెప్పాలంటే భారత్ ప్రపంచానికి అన్ని విధాలుగా అండగా ఉంటుంది, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో శాంతి భద్రతలు కాపాడటానికి భారత దేశం నుండి 1,80,000 మంది ఆర్మీ 49 దేశాలలో సేవలు అందిస్తున్నారు.
భారత్ తప్ప మరే దేశం కూడా ఈ స్థాయిలో శాంతి భద్రతల కాపాడటానికి పని చేయడం లేదు. ఇన్ని అర్హతులు ఉన్న భారత్ కు ఎప్పుడో శాశ్వత సభ్యత్వం కలిగి ఉండాలి. కానీ అగ్ర దేశాలుగా చెప్పుకొనే భద్రత మండలి లోని శాశ్వత దేశాల ఆధిపత్య పోరు వల్లన ఇంకా సాధ్యం కాలేదు. ఇప్పటికైనా ఈ దేశాలు నిద్ర లేచి ఐక్యరాజ్య సమితిని పునవ్యస్థీకరించాల్సిన అవసరం ఉంది. లేని పక్షం లో ఐక్యరాజ్య సమితికే మనుగడే ప్రశ్నర్దికం అవుతుంది.
(రచయిత `టువర్డ్స్ బెటర్ ఇండియా’ వ్యవస్థాపకులు, ప్రధాన కార్యదర్శి)
More Stories
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్యం తోఫా’
జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం