
చైనా సైనికులతో జరిగిన బహాబాహీ ఘర్షణలో అమరులైన 20 మంది భారత సైనికుల స్మృత్యర్ధం నూతన యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. లడఖ్‌లోని వ్యూహాత్మక రహదారి దుర్బూక్-శ్యోక్-దౌలత్ బేగ్ ఓల్డీలోని కేఎమ్ -120 పోస్ట్ సమీపంలో ఈ స్మారకాన్ని నిర్మించారు.
స్మారక చిహ్నంపై 20 మంది సైనికుల పేర్లు అదేవిధంగా జూన్ 15 నాటి ఆపరేషన్ వివరాలను పొందుపరిచారు. స్మారక గోడపై ఇలా లిఖించారు:
15 జూన్, 2020న గాల్వాన్ లోయ వద్ద కల్నల్ బి సంతోష్ బాబు కమాండింగ్ ఆఫీసర్ నేతృత్వంలోని 16 బిహార్ క్విక్ రియాక్షన్ ఫోర్స్ చైనా దళాలను వై నాలా నుంచి విజయవంతంగా తొలగించి పీపీ 14కు చేరుకుంది. అక్కడ భారత సైనికులకు, పీఎల్ఏ దళాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.
ఇది బాహాబాహీ ఘర్షణకు దారితీసి భారీ ప్రాణనష్టం కలిగించింది. ఇరవై “గాలంట్స్ ఆఫ్ గాల్వన్” బలిదానం సాధించింది అని పేర్కొంది. ఈ ఘర్షణలో చైనా సైన్యం ఎక్కువ ప్రాణనష్టానికి గురైందని చెబుతున్నప్పటికీ చైనా దాని గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.
More Stories
జగన్నాథుడి ఆలయ శిఖరంపై ముడిపడిన జెండాలు
ఓటుకు ఆధార్ లింక్‌పై 18న ఈసీ భేటీ
అమృత్‌సర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి